శార్దూల్ అరంగేట్రం | Sakshi
Sakshi News home page

శార్దూల్ అరంగేట్రం

Published Thu, Aug 31 2017 2:26 PM

శార్దూల్ అరంగేట్రం - Sakshi

కొలంబో: శ్రీలంకతో ఐదు వన్డేల సిరీస్ లో భాగంగా ఇక్కడ గురువారం ప్రేమదాస స్టేడియంలో జరుగుతున్న నాల్గో వన్డేలో టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన విరాట్ కోహ్లి తొలుత బ్యాటింగ్ చేసేందుకు మొగ్గుచూపాడు. ఈ వన్డే సిరీస్ లోఇప్పటివరకూ టాస్ గెలిస్తే బౌలింగ్ తీసుకున్న కోహ్లి.. నాల్గో వన్డేలో మాత్రం బ్యాటింగ్ తో ప్రయోగం చేసేందుకు ఆసక్తికనబరిచాడు.

ఇదిలా ఉంచితే, ఈ మ్యాచ్ లో భారత్ మూడు ప్రయోగాలతో పోరుకు సిద్ధమైంది. కేదర్ జాదవ్, భువనేశ్వర్ కుమార్, చాహల్ కు విశ్రాంతినిచ్చింది. వారి స్థానాల్లో మనీష్ పాండే, చైనామన్ కుల్దీప్ యాదవ్ లతో పాటు మహరాష్ట్ర ఆటగాడు శార్దూల్ ఠాకూర్ కు చోటు కల్పించారు. ఈ వన్డే ద్వారా శార్దూల్ ఠాకూర్ జాతీయ జట్టులోకి అరంగేట్రం చేశాడు. గతేడాది వెస్టిండీస్ పర్యటనకు వెళ్లిన భారత జట్టులో శార్దూల్ ను ఎంపిక చేసినప్పటికీ, అతనికి ఆడే అవకాశం దక్కలేదు. కేవలం  అక్కడ ప్రాక్టీస్ మ్యాచ్ లకు మాత్రమే శార్దూల్ పరిమితమయ్యాడు. తాజాగా జట్టులోకి వచ్చిన శార్దూల్  ఏ మేరకు రాణిస్తాడనేది ఆసక్తికరం.

లంకతో వన్డే సిరీస్‌ను ఇప్పటికే 3–0తో సొంతం చేసుకున్న భారత్, ఈ ఆధిక్యాన్ని మరింత పెంచుకోవాలని పట్టుదలగా ఉండగా... స్వదేశంలో ఇప్పటికే తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న శ్రీలంక కాస్తయినా పరువు దక్కించుకోవాలంటే ఒక మ్యాచ్‌లోనైనా విజయం సాధించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో నేడు ఇక్కడ జరిగే నాలుగో వన్డేలో ఇరు జట్లు తలపడనున్నాయి.

భారత తుది జట్టు: విరాట్ కోహ్లి(కెప్టెన్), రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్, మనీష్ పాండే, ఎంఎస్ ధోని, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, బూమ్రా, శార్దూల్ ఠాకూర్

శ్రీలంక తుది జట్టు: లసిత్ మలింగా(కెప్టెన్), డిక్ వెల్లా, దిల్షాన్ మునావీరా, కుశాల్ మెండిస్, తిరిమన్నే, ఏంజెలో మాథ్యూస్, సిరివర్దనే, వనిందు హసరంగా, అకిలా దనంజయచ మలిందా పుష్పకుమార, విశ్వ ఫెర్నాండో
 

Advertisement
Advertisement