షూటర్ రాజ్పుత్కు రజతం | Sakshi
Sakshi News home page

షూటర్ రాజ్పుత్కు రజతం

Published Tue, Jun 28 2016 5:13 PM

Shooter Sanjeev Rajput settles for silver in World Cup

బాకు(అజర్బైజాన్):ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్ ఫెడరేషన్(ఐఎస్ఎస్ఎఫ్) వరల్డ్ కప్లో భారత షూటర్ సంజీవ్ రాజ్పుత్ రజతం సాధించాడు. అజర్ బైజాన్లో జరుగుతున్న ప్రపంచకప్ టోర్నమెంట్లో ఆద్యంత ఆకట్టుకున్న రాజ్ పుత్ రెండో స్థానంలో నిలిచి రజత పతకం దక్కించుకున్నాడు.  పురుషుల 50 మీటర్ల త్రీ పొజిషన్లో 456.9 పాయింట్ల స్కోరు చేసి రజతాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు.

 

ఈ పోటీలో కొరేషియా షూటర్ పీటర్ గోర్సా 4 57.5 పాయింట్ల స్కోరుతో స్వర్ణాన్ని సాధించగా,  కొరియా షూటర్ హైన్జున్ కిమ్ 445.5 స్కోరుతో కాంస్య పతకాన్ని దక్కించుకున్నాడు. ఇదిలా ఉండగా, మరో భారత షూటర్ జితూ రాయ్ 10 మీ ఎయిర్ రైఫిల్ విభాగంలో రజతం సాధించాడు. దీంతో భారత్ ఖాతాలో రెండు రజతాలు చేరాయి. కాగా, లండన్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత, భారత షూటర్ గగన్ నారంగ్ 1161 పాయింట్ల స్కోరు చేసి 23వ స్థానంలో నిలిచాడు.

Advertisement
Advertisement