అతనికి మంచి భవిష్యత్తు ఉంది: గావస‍్కర్‌ | Sakshi
Sakshi News home page

అతనికి మంచి భవిష్యత్తు ఉంది: గావస‍్కర్‌

Published Thu, Jan 31 2019 4:08 PM

Shubman Gill has a future with India, Gavaskar - Sakshi

హామిల్టన్‌: న్యూజిలాండ్‌తో జరిగిన నాల్గో వన్డే ద్వారా అంతర్జాతీయ అరంగేట్రం చేసిన శుబ్‌మన్‌ గిల్‌కు మంచి భవిష్యత‍్తు ఉందని భారత క్రికెట్‌ జట్టు దిగ్గజ ఆటగాడు సునీల్‌ గావస్కర్‌ జోస్యం చెప్పాడు. అరంగేట్రం మ్యాచ్‌లో శుబ్‌మన్‌ నిరాశపరిచినప్పటికీ అతను భారత జట్టులో కీలక ఆటగాడిగా ఎదుగుతాడన‍్నాడు. తాజా మ్యాచ్‌లో రాణించాలనే ఒత్తిడికి గురికావడంతోనే శుబ్‌మాన్‌ తొందరగా వికెట్‌ను సమర్పించుకున్నాడన్నాడు.

‘భారత్‌ తరఫున శుబ్‌మన్‌కు ఇది తొలి మ్యాచ్‌. దాంతో ఒకింత ఒత్తిడి, ఆందోళన ఉండటం సహజం. మరొకవైపు బంతి బాగా స్వింగ్‌ కావడంతో బౌల్ట్‌ నిప్పులు చెరిగే బంతులు సంధించాడు. బౌల్ట్‌ విసిరిన ఒక షార్ట్‌ బాల్‌ శుబ్‌మన్‌ హెల్మెట్‌కు బలంగా తగిలింది. శుబ్‌మన్‌ విషయంలో టీమిండియా యాజమన్యానికి ఓపిక అవసరం. టీమిండియా జట్టులో అతను కీలక ఆటగాడిగా ఎదుగుతాడు’ అని గావస్కర్‌ పేర్కొన్నాడు. ఈ మ్యాచ్‌లో శుబ్‌మన్‌ గిల్‌ 9 పరుగులు చేసి ఔటయ్యాడు.

Advertisement
Advertisement