'గర్ల్ ఫ్రెండ్ పేరు ఇప్పటికీ చెప్పడు' | Sakshi
Sakshi News home page

'గర్ల్ ఫ్రెండ్ పేరు ఇప్పటికీ చెప్పడు'

Published Tue, Aug 23 2016 6:55 PM

'గర్ల్ ఫ్రెండ్ పేరు ఇప్పటికీ చెప్పడు'

జమైకా: అతడు రియోలో మెరిశాడు.. అంతకుముందు ప్రపంచ చాంపియన్ షిప్ లో తళుక్కుమన్నాడు. ఒక్కమాటలో చెప్పాలంటే అసలు ఎప్పుడు దిగితే అప్పుడు.. ఎక్కడ దిగితే అక్కడ.. విజయాన్ని భుజాన వేసుకొని పరుగెత్తాడు. ఫలితంగా అతడిది బంగారు వేటలా మారింది. పాల్గొన్న ప్రతి ఈవెంట్ లో బంగారు పతకం దక్కింది. ఆ వ్యక్తి ఎవరో కాదు.. ఉస్సేన్ బోల్ట్. మనుషులందరి వేగంలో చిరుతలాంటివాడని పేర్గాంచిన ఈ జమైకా పరుగుల చిరుత గురించి కొన్ని వ్యక్తిగతమైన విషయాలు గమనిస్తే..

  • బోల్ట్ ఆగస్టు 21, 1986లో జమైకాలోని షేర్ వుడ్ లో జన్మించాడు. అతడి తల్లిదండ్రులు ఓ జనరల్ స్టోర్ నడిపేవారు. అతడికి షెరిన్ అనే ఓ సోదరి, సాదికి అనే ఓ సోదరుడు ఉన్నాడు.
  • బోల్ట్ సగటు విద్యార్థి మాత్రమే. అతడికి ప్రధానంగా క్రికెట్, ఫుట్ బాల్ అంటే ఆసక్తి. జమైకాలోని ఐఏఏఎఫ్ హై ఫర్ఫామెన్స్ ట్రైనింగ్ సెంటర్ ద్వారా స్కాలర్ షిప్ పొందాడు.
  • పది హేనేళ్లకే బోల్ట్ తన పరుగుల మొదలుపెట్టాడు. జమైకాలోని కింగ్స్టన్ లోజరిగిన వరల్డ్ జూనియర్ చాంపియన్షిప్ లో 200 మీటర్ల పరుగుపందెంలో గెలుపొందాడు.
  • ఇప్పటి వరకు అతడికి ఒలింపిక్ లో ఆరు, ప్రపంచ చాంపియన్ షిప్ లో 11 బంగారు పతకాలు వచ్చాయి.
  • 2009 బెర్లిన్ లో జరిగిన 100 మీటర్లు, 200 మీటర్ల పరుగుపందెంలో వరుసగా 9.58, 19.19 సెకన్లలో లక్ష్యాన్ని పూర్తి ప్రపంచ రికార్డు సృష్టించాడు.
  • బోల్ట్ ప్రస్తుతం జమైకాలో ఉంటున్నాడు. ఆయనకు ఒక గర్ల్ ఫ్రెండ్ కూడా ఉంది. కానీ, ఆమె పేరు ఇప్పటి వరకు బోల్ట్ చెప్పలేదు.. చెప్పడానికి ఇష్టపడడంట కూడా. మరో విషయమేమిటంటే అతడికి 35 ఏళ్లు వచ్చే వరకు పెళ్లి చేసుకోడంట.

Advertisement
Advertisement