ధోనీతో నో ప్రాబ్లమ్.. కోహ్లీతో అలా కాదు: అశ్విన్ | Sakshi
Sakshi News home page

ధోనీతో నో ప్రాబ్లమ్.. కోహ్లీతో అలా కాదు: అశ్విన్

Published Sun, Apr 9 2017 2:41 PM

ధోనీతో నో ప్రాబ్లమ్.. కోహ్లీతో అలా కాదు: అశ్విన్

ముంబై: టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ గాయం కారణంగా తాజా ఐపీఎల్ సీజన్ కు దూరమయ్యాడు. ముంబైలో ఓ ఈవెంట్లో పాల్గొన్న అశ్విన్ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. మాజీ కెప్టెన్ ధోనీ, ప్రస్తుత కెప్టెన్ కోహ్లీలలో ఎవరితో ఎక్కువగా కలిసిపోతారన్న దానిపై స్పందించాడు. కోహ్లీ అంటే తనకు కొన్ని సందర్భాలలో భయమని, ఫీల్డింగ్ సెట్ చేయడంలో ఇది స్పష్టంగా కనిపిస్తుందన్నాడు. కోహ్లీ చాలా దూకుడుగా వ్యవహరిస్తాడని, కొన్నిసార్లు తన వద్దకు వచ్చి పలానా పొజిషన్లో ఫీల్డర్ ను ఎందుకు తీసేశావ్ అని ప్రశ్నించాడని గుర్తుచేసుకున్నాడు. వ్యక్తిగతంగా గేమ్ ఆడుతున్నట్లు భావిస్తుంటాడని, అయితే తనకు కోహ్లీ, ధోనీలను కాపీ కొట్టే ఉద్దేశమే లేదని అశ్విన్ వ్యాఖ్యానించాడు.

'దేశమంతా ధోనీనే మరింత కాలం కెప్టెన్ గా ఉండాలని కోరుకుంటున్నారు. నేను ధోనీ కెప్టెన్సీలో దాదాపు అయిదేళ్లు ఆడాను. చాలా అనుభవంతో, ఎంతో గొప్పగా నిర్ణయాలు తీసుకుంటాడు. జట్టులో ఆత్మవిశ్వాసాన్ని నింపుతాడు. టాస్ కు వెళ్లేముందు జట్టులోకి తీసుకోని ప్లేయర్ కు తగిన కారణాలు చూపించి సర్దిచెప్పే మనస్తత్వం ధోనీ సొంతం. ధోనీకి ఈ సందర్భంగా నా ధన్యవాదాలు చెబుతున్నాను' అని అశ్విన్ చెప్పుకొచ్చాడు. ధోనీ కెప్టెన్సీలో చెన్నై సూపర్ కింగ్స్ లో ఆడిన అశ్విన్, ఆ తర్వాత రైజింగ్ పుణే సూపర్ జెయింట్ తరఫున గత సీజన్ లో అతడి కెప్టెన్సీలోనే ఆడాడు. పుణేకు ప్రస్తుతం స్టీవ్ స్మిత్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు.

Advertisement

తప్పక చదవండి

Advertisement