సౌరాష్ట్రకు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం | Sakshi
Sakshi News home page

సౌరాష్ట్రకు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం

Published Fri, Feb 5 2016 12:41 AM

sourashtra lead by first innings

జోగియాని, జాక్సన్ సెంచరీలు 
విదర్భతో ‘రంజీ’ క్వార్టర్ ఫైనల్

సాక్షి, విజయనగరం: సాగర్ జోగియాని (130; 17 ఫోర్లు, 2 సిక్సర్లు), షెల్డన్ జాక్సన్ (122; 13 ఫోర్లు, 6 సిక్సర్లు) సెంచరీలతో చెలరేగడంతో... విదర్భతో ఇక్కడ జరుగుతున్న రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్లో సౌరాష్ట్ర తొలి ఇన్నింగ్స్‌లో 112.4 ఓవర్లలో 375 పరుగులకు ఆలౌటైంది. దీంతో సౌరాష్ట్రకు 224 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. ఉమేశ్ 5, ఆదిత్య 4 వికెట్లు తీశారు.తర్వాత బ్యాటింగ్‌కు దిగిన విదర్భ రెండో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో 7 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 17 పరుగులు చేసింది. ప్రస్తుతం విదర్భ 207 పరుగులు వెనుకబడి ఉంది.

ఇతర మ్యాచ్‌ల స్కోర్లు
అస్సాం తొలి ఇన్నింగ్స్: 323 ఆలౌట్ (సయ్యద్ మొహమ్మద్ 121, సిద్ధార్థ్ కౌల్ 4/99); పంజాబ్ తొలి ఇన్నింగ్స్: 137 ఆలౌట్ (మయాంక్ 80 నాటౌట్, కృష్ణ దాస్ 3/54, అరూప్ దాస్ 3/41); అస్సాం రెండో ఇన్నింగ్స్: 23/4.

మధ్యప్రదేశ్ తొలి ఇన్నింగ్స్: 348 ఆలౌట్ (దేవేంద్ర బుండేలా 58, హర్‌ప్రీత్ 51, ప్రతాప్ సింగ్ 5/76); బెంగాల్ తొలి ఇన్నింగ్స్: 121 ఆలౌట్ (ఈశ్వరన్ 48, ఈశ్వర్ పాండే 4/45, పునీత్ 3/30); మధ్యప్రదేశ్ రెండో ఇన్నింగ్స్: 14/0.

ముంబై తొలి ఇన్నింగ్స్: 416 ఆలౌట్ (అభిషేక్ నాయర్ 74, ఇక్బాల్ అబ్దుల్లా 33, సుఫియాన్ 23, నదీమ్ 5/140); జార్ఖండ్ తొలి ఇన్నింగ్స్: 150/8 (ఆనంద్ 39, కౌశల్ సింగ్ 22 నాటౌట్, గౌతమ్ 18, హర్‌వాడేకర్ 3/26, ఇక్బాల్ అబ్దుల్లా 3/39).

Advertisement
Advertisement