దక్షిణాఫ్రికా చెత్త రికార్డు | Sakshi
Sakshi News home page

దక్షిణాఫ్రికా చెత్త రికార్డు

Published Sun, Feb 4 2018 4:30 PM

South Africa are spun out for their lowest all out total at home - Sakshi

సెంచూరియన్‌: సొంతగడ్డపై జరుగుతున్న ఆరు వన్డేల సిరీస్‌లో భాగంగా భారత్‌తో రెండో వన్డేలో దక్షిణాఫ్రికా చెత్త రికార్డును మూటగట్టుకుంది. టీమిండియాతో రెండో వన్డేలో 118 పరుగులకే కుప్పకూలిన సఫారీలు.. స్వదేశంలో తొలిసారి అత్యల్ప వన్డే స్కోరును నమోదు చేసిన అపప్రథను సొంతం చేసుకున్నారు. ఈ మ్యాచ్‌లో ఏ ఒక్క బ్యాట్స్‌మెన్‌ ఆకట్టుకోలేకపోవడంతో దక్షిణాఫ్రికా స్వల్ప స్కోరుకే పరిమితమైంది. ఫలితంగా స్వదేశంలో అత్యల్ప వన్డే స్కోరును సఫారీలు నమోదు చేశారు.

ఓవరాల్‌గా చూస్తే భారత్‌పై దక్షిణాఫ్రికా ఇది రెండో అత్యల్ప వన్డే స్కోరు. అంతకుముందు 1999లో నైరోబిలో జరిగిన వన్డేలో దక్షిణాఫ్రికాను 117 పరుగులకే భారత్‌ ఆలౌట్‌ చేసింది. కాగా,దక్షిణాఫ్రికా అత్యల్ప వన్డే స్కోరు 69  1993లో ఆస్ట్రేలియాతో సిడ్నీలో జరిగిన మ్యాచ్‌లో సఫారీలు రెండంకెల స్కోరుకే చాపచుట్టేశారు. తాజా మ్యాచ్‌లో భారత స్పిన్నర్‌ ఐదు వికెట్లు సాధించి సఫారీల పతనాన్ని శాసించాడు. ఇదే చాహల్‌కు అత్యుత్తమ వన్డే ప్రదర్శన. చాహల్‌ 8.2 ఓవర్లలో ఒక మేడిన్‌ సాయంతో 22 పరుగులిచ్చి ఐదు వికెట్లు సాధించాడు. అతనికి జతగా కుల్దీప్‌ యాదవ్‌ మూడు వికెట్లు తీశాడు. ఆరు ఓవర్లలో కుల్దీప్‌ 20 పరుగులిచ్చి మూడు వికెట్లను ఖాతాలో వేసుకున్నాడు. ఫలితంగా దక్షిణాఫ్రికా 119 పరుగుల లక్ష్యాన్ని మాత్రమే భారత్‌కు నిర్దేశించింది. తొలి వన్డేలో భారత్‌ విజయం సాధించి సిరీస్‌లో ముందంజ వేసిన సంగతి తెలిసిందే.


 

Advertisement
Advertisement