Sakshi News home page

లంకను ఆదుకున్న 2 'సెంచరీ' భాగస్వామ్యాలు

Published Wed, Aug 24 2016 7:06 PM

లంకను ఆదుకున్న 2 'సెంచరీ' భాగస్వామ్యాలు

ఐదు వన్డేల సిరీస్ లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో వన్డేలో శ్రీలంక 48.5ఓవర్లలో 288 పరుగుల వద్ద ఆలౌటైంది. మూడొందల పరుగులు అలవోకగా చేసేలా కనిపించిన లంక, ఆసీస్ పేసర్లు చెలరేగడంతో తన చివరి 5 వికెట్లను 17 పరుగుల వ్యవధిలో కోల్పోవడంతో సాధారణ స్కోరుకు పరిమితమైంది. ఆరంభంలో కాస్త తడబడిన లంక కుశాల్ మెండిస్ హాఫ్ సెంచరీ(69 బంతుల్లో 69 పరుగులు: 9 ఫోర్లు),  చండిమల్(67 బంతుల్లో 48 పరుగులు: 2 ఫోర్లు, 1 సిక్స్) మూడో వికెట్ కు సెంచరీ(125 పరుగుల) భాగస్వామ్యంతో కోలుకుంది.

వీరిద్దరిని ఆసీస్ బౌలర్ జంపా స్వల్ప వ్యవధిలో ఔట్ చేయడం ఫలితంగా 158 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి లంకకు మళ్లీ కష్టాలు మొదలయ్యాయి.  అయితే ఆరో వికెట్ కు కుశాల్ పెరీరా(53 బంతుల్లో 54 పరుగులు: 5 ఫోర్లు, 1 సిక్స్),  లంక కెప్టెన్ ఎంజెలో మాథ్యూస్(60 బంతుల్లో 57 పరుగులు: 1 ఫోర్, 1 సిక్స్) రాణించి సెంచరీ భాగస్వామ్యాన్ని (103పరుగులు) జతచేశారు. చివర్లో ఆసీస్ పేసర్ జేమ్స్ ఫాల్కనర్ హ్యాట్రిక్ వికెట్లు తీయడం, ఒకే ఓవర్లో స్టార్క్ రెండు వికెట్లు తీయడంతో 300 స్కోరు దాటేలా కనిపించిన లంక 288 పరుగులకే పరిమితమైంది.  ఆసీస్ బౌలర్లలో స్టార్క్, జంపా, ఫాల్కనర్ తలో మూడు వికెట్లు పడగొట్టగా, లియాన్ ఒక్క వికెట్ తీశాడు.

Advertisement

తప్పక చదవండి

Advertisement