ఆస్ట్రేలియా తడబాటు | Sakshi
Sakshi News home page

ఆస్ట్రేలియా తడబాటు

Published Sat, Jul 30 2016 12:06 AM

ఆస్ట్రేలియా తడబాటు

శ్రీలంకతో తొలి టెస్టు
పల్లెకెల్: శ్రీలంక స్పిన్నర్ల మ్యాజిక్‌తో... ఆస్ట్రేలియాతో జరగుతున్న తొలి టెస్టు రసకందాయంలో పడింది. 268 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు నాలుగోరోజు శుక్రవారం బరిలోకి దిగిన ఆసీస్ ఆట ముగిసే సమయానికి 27 ఓవర్లలో 3 వికెట్లకు 83 పరుగులు చేసింది. స్మిత్ (26 బ్యా టింగ్), వోజెస్ (9 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. బర్న్స్ (29), వార్నర్ (1), ఖవాజ (18) నిరాశపర్చారు. ప్రస్తుతం కంగారూలు విజయానికి 185 పరుగులు చేయాల్సి ఉం డగా, లంక 7 వికెట్ల దూరంలో ఉంది. ఐదో రోజు ఉదయం స్పిన్నర్లు మరోసారి సత్తా చాటితే ఆసీస్‌కు కష్టాలు తప్పవు.

అంతకుముందు 282/6 ఓవర్‌నైట్ స్కోరుతో నాలుగో రోజు ఆట కొనసాగించిన లంక రెండో ఇన్నింగ్స్‌లో 93.4 ఓవర్లలో 353 పరుగులకు ఆలౌటైంది. కుశాల్ మెండిస్ (254 బంతుల్లో 176; 21 ఫోర్లు, 1 సిక్స్), పెరీరా (12) తొందరగానే అవుటైనా... హెరాత్ (35) ఫర్వాలేదనిపించాడు. ప్రదీప్ (10 నాటౌట్)తో కలిసి ఆఖరి వికెట్‌కు 30 పరుగులు జత చేశాడు. ఓవరాల్‌గా లంక 71 పరుగులు జోడించి చివరి నాలుగు వికెట్లు చేజార్చుకుంది. స్టార్క్ 4, హాజల్‌వుడ్, లియోన్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.

Advertisement
Advertisement