సారీ.. నాదే బాధ్యత : కంటతడి పెట్టిన స్మిత్‌ | Sakshi
Sakshi News home page

Published Thu, Mar 29 2018 2:41 PM

Steve Smith Cries at Press Meet over Ball Tampering Issue - Sakshi

సాక్షి, సిడ్నీ : బ్యాల్‌ ట్యాంపరింగ్‌ ఆరోపణలపై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌ ఎట్టకేలకు క్షమాపణలు తెలియజేశాడు. గురువారం సిడ్నీలో నిర్వహించిన మీడియా సమావేశంలో స్మిత్‌ మాట్లాడాడు. ఈ సందర్భంగా తన తప్పుకు ప్రాయశ్చిత్తం వ్యక్తం చేస్తూ స్మిత్‌ భావోద్వేగానికి లోనయ్యాడు. ట్యాంపరింగ్‌ వ్యవహారం

‘నన్ను క్షమించండి. కెప్టెన్‌గా జరిగిన పరిణామాలకు నాదే పూర్తి బాధ్యత. నాయకుడిగా నేను పూర్తిగా విఫలం అయ్యా. నిర్ణయం పేరిట నేను ఘోర తప్పిదం చేశాను. పైగా దానిని కప్పిపుచ్చుకునేందుకు నేను చేసిన ప్రయత్నాలు నాకు మరింత నష్టాన్ని కలిగించాయి. ఈ తప్పు నన్ను జీవితం వెంటాడుతుంది’ అంటూ కన్నీటి పర్యంతం అయ్యాడు. 

.. ‘నాకు జరిగిన ఈ నష్టం వల్ల  లాభం ఏదైనా ఉందా అంటే.. ఇది ఇతరులకు గుణపాఠం కావటమే. ఇది క్రీడా వ్యవస్థలో ఒక మార్పును తీసుకొస్తుందని ఆశిస్తున్నా. క్రికెట్‌ నా జీవితం. మైదానంలో మళ్లీ త్వరగా అడుగుపెట్టాలని కొరుకుంటున్నా’ అని స్మిత్‌ గద్గద స్వరం స్వరంతో చెప్పుకొచ్చాడు. 

(బయటపడ్డ మరో నిజం)

కాగా, బాల్‌ ట్యాంపరింగ్‌ ఆరోపణల అనంతరం మీడియా ముందు మాట్లాడిన స్మిత్‌.. మ్యాచ్‌ వ్యూహంలోనే భాగంగా టీమంతా ఈ పనికి పాల్పడినట్లు చెప్పటం.. ఆ వ్యాఖ్యలు మరింత విమర్శలకు దారితీయటం తెలిసిందే.  (ట్యాంపరింగ్‌పై సంచలన వ్యాఖ్యలు), (ఈ వీడియో చూస్తే నవ్వాగదు)

Advertisement

తప్పక చదవండి

Advertisement