‘ప్రైడ్‌ ఆఫ్‌ తెలంగాణ’గా సుహేమ్‌ షేక్‌

1 Jul, 2019 14:04 IST|Sakshi

 జాతీయ స్థాయి సెయిలర్లను తీర్చిదిద్దిన కోచ్‌

సాక్షి, హైదరాబాద్‌: మధ్యతరగతి, వెనుకబడిన వర్గాలకు చెందిన పలువురు క్రీడాకారులను జాతీయ స్థాయి సెయిలర్లుగా తీర్చిదిద్దిన కోచ్‌ ‘సుహేమ్‌ షేక్‌’ కృషికి ఫలితం దక్కింది. ఆయన సేవలకు గుర్తింపుగా రౌండ్‌ టేబుల్‌ ఇండియా సంస్థ ‘ప్రైడ్‌ ఆఫ్‌ తెలంగాణ’ పురస్కారంతో సుహేమ్‌ షేక్‌ను  గౌరవించింది. హెచ్‌ఐసీసీ వేదికగా శనివారం రాత్రి జరిగిన అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో ఆయన ఈ అవార్డును అందుకున్నారు.

అంతర్జాతీయ స్థాయి సెయిలర్‌ అయిన షేక్‌ ఆధ్వర్యంలో పలువురు క్రీడాకారులు జాతీయ స్థాయిలో రాణించారు. ఆయన శిక్షణలో ఆరుగురు నేషనల్‌ చాంపియన్స్‌గా అవతరించగా... 25 మంది జాతీయ స్థాయిలో పతకాలను సాధించారు. 10 మంది రాష్ట్రస్థాయిలో చాంపియన్‌లుగా నిలిచారు. ఆయన శిష్యులు 10 మంది ఆర్మీ, నేవీ సెయిలింగ్‌ స్కూల్స్‌కు ఎంపికయ్యారు.    

మరిన్ని వార్తలు