మరో విజయంపై భారత్ దృష్టి

10 Apr, 2016 00:55 IST|Sakshi
మరో విజయంపై భారత్ దృష్టి

ఇఫో(మలేసియా): అజ్లాన్ షా కప్ హాకీ టోర్నమెంట్‌లో భారత్ మరో విజయంపై దృష్టి పెట్టింది. తొలి మ్యాచ్‌లో జపాన్‌పై గెలిచిన టీమిండియా... రెండో మ్యాచ్‌లో ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది. రెండు రోజుల విరామం తీసుకున్న భారత్... ఆదివారం తమ మూడో మ్యాచ్‌ను కెనడా జట్టుతో ఆడనుంది. తండ్రి మరణం కారణంగా మొదటి రెండు మ్యాచ్‌ల్లో జట్టుకు దూరమైన స్టార్ మిడ్‌ఫీల్డర్ మన్‌ప్రీత్‌సింగ్ జట్టుతో చేరాడు. శనివారం ఉదయం నిర్వహించిన ట్రైనింగ్ సెషన్‌లో అతను పాల్గొన్నాడు.

మన్‌ప్రీత్ చేరికతో భారత మిడ్‌ఫీల్డ్ విభాగం పటిష్టమైంది. కెప్టెన్ సర్దార్ సింగ్‌తో కలిసి మిడ్‌ఫీల్డ్‌లో కదిలే మన్‌ప్రీత్ అవసరమైతే డిఫెండర్‌గా కూడా ఆడతాడు. రియో ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన కెనడా జట్టును తాము తక్కువ అంచనా వేయడంలేదని భారత కోచ్ రోలంట్ ఓల్ట్‌మన్స్ తెలిపారు.

>
మరిన్ని వార్తలు