సుమన్ మెరుపు సెంచరీ | Sakshi
Sakshi News home page

సుమన్ మెరుపు సెంచరీ

Published Sun, Mar 29 2015 2:49 AM

సుమన్ మెరుపు సెంచరీ - Sakshi

కొచ్చి: తిరుమలశెట్టి సుమన్ (60 బంతుల్లో 100, 9 ఫోర్లు, 7 సిక్సర్లు) వీరవిహారంతో హైదరాబాద్ 31 పరుగుల తేడాతో కర్ణాటకపై విజయం సాధించింది. ‘సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ’ సౌత్‌జోన్ టి20 టోర్నీలో శనివారం జరిగిన ఈ లీగ్ మ్యాచ్‌లో సుమన్ సూపర్ ఇన్నింగ్స్‌తో చెలరేగాడు. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. ఓపెనర్ సుమన్ కర్ణాటక బౌలర్లపై భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. అతను చేసిన వంద పరుగుల్లో 78 పరుగులు బౌండరీల ద్వారానే లభించాయి.

మరో ఓపెనర్ తన్మయ్ అగర్వాల్ (23 బంతుల్లో 29, 6 ఫోర్లు)తో కలిసి తొలి వికెట్‌కు 54 పరుగులు జోడించాడు. కర్ణాటక బౌలర్లలో శరత్, మోరె, సుచిత్, నవీన్, గోపాల్ తలా ఒక వికెట్ పడగొట్టారు. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన కర్ణాటక 20 ఓవర్లలో 8 వికెట్లకు 131 పరుగులు చేయగల్గింది. హైదరాబాద్ బౌలర్ ఆశిష్ రెడ్డి (4/22) విజృంభించడంతో టాప్‌ఆర్డర్ విలవిల్లాడింది. 16 పరుగులకే నాలుగు వికెట్లను కోల్పోయింది. గోపాల్ (22 బంతుల్లో 39, 2 ఫోర్లు, 3 సిక్సర్లు), మనీశ్ పాండే (37 బంతుల్లో 30, 1 ఫోర్) మెరుగ్గా ఆడారు. హైదరాబాద్ బౌలర్లలో రవికిరణ్, ప్రజ్ఞాన్ ఓజా, భండారి, మిలింద్ తలా ఒక వికెట్ తీశారు.

స్కోరు వివరాలు
హైదరాబాద్ ఇన్నింగ్స్: సుమన్ (సి) సుచిత్ (బి) మోరె 100; తన్మయ్ (సి) మయాంక్ (బి) నవీన్ 29; విహారి (సి) సమర్థ్ (బి) సుచిత్ 6; అక్షత్ రెడ్డి (స్టంప్డ్) మనీశ్ (బి) గోపాల్ 0; బెంజిమిన్ ఎల్బీడబ్ల్యూ (బి) శరత్ 16, ఆశిష్ రెడ్డి నాటౌట్ 6, భండారి 1; ఎక్స్‌ట్రాలు 4; (20 ఓవర్లలో 5 వికెట్లకు) 162
 
వికెట్ల పతనం: 1-54, 2-84, 3-85, 4-153, 5-157
 బౌలింగ్: శరత్ 4-0-41-1, మోరె 4-0-23-1, మతియాస్ 2-0-21-0, సుచిత్ 4-0-29-1, నవీన్ 1-0-10-1, గోపాల్ 3-0-21-1, ఉదిత్ పటేల్ 2-0-15-0
 
కర్ణాటక ఇన్నింగ్స్: సమర్థ్ ఎల్బీడబ్ల్యూ (బి) ఆశిష్ 0; మయాంక్ (బి) ఆశిష్ 1, నవీన్ (బి) ఆశిష్ 6; నాయర్ (సి) ఆశిష్ (బి) రవికిరణ్ 6; మనీశ్ పాండే (సి) అండ్ (బి) మిలింద్ 30; మతియాస్ (బి) భండారి 13; గోపాల్ (సి) సబ్- సందీప్ (బి) ఓజా 39; సుచిత్ (సి) మిలింద్ (బి) ఆశిష్ 10; ఉదిత్ పటేల్ నాటౌట్ 8, మోరె నాటౌట్ 1; ఎక్స్‌ట్రాలు 17; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 131
 వికెట్ల పతనం: 1-2, 2-3, 3-16, 4-16, 5-52, 6-106, 7-114, 8-121
 బౌలింగ్: ఆశిష్ 4-0-22-4, రవికిరణ్ 4-1-15-1, కనిష్క్ 2-0-6-0, ఓజా 4-0-32-1, భండారి 2-0-15-1, మిలింద్ 4-0-29-1
 
కేరళపై ఆంధ్ర గెలుపు
మరో మ్యాచ్‌లో ఆంధ్ర జట్టు 4 వికెట్ల తేడాతో ఆతిథ్య కేరళ జట్టుపై విజయం సాధించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేపట్టిన కేరళ 20 ఓవర్లలో 7 వికెట్లకు 148 పరుగులు చేసింది. జాఫర్ జమాల్ (23 బంతుల్లో 38 నాటౌట్, 2 ఫోర్లు, 3 సిక్సర్లు) ధాటిగా ఆడాడు. సంజూ శామ్సన్ 26, ప్రేమ్ 26, సచిన్ బేబి 22 మెరుగ్గా ఆడారు. ఆంధ్ర బౌలర్లలో స్టీఫెన్, అయ్యప్ప చెరో 2 వికెట్లు తీశారు. తర్వాత ఆంధ్ర జట్టు సరిగ్గా 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసి గెలిచింది. కెప్టెన్ కైఫ్ 28, రికీ భుయ్ 28, నరేన్ రెడ్డి 25, ప్రదీప్ 22 పరుగులు చేశారు. కేరళ బౌలర్లలో మనుకృష్ణన్, అమిత్ వర్మ చెరో 2 వికెట్లు పడగొట్టారు.

Advertisement
Advertisement