సునీల్ నరైన్ స్థానంలో మిల్లర్ | Sakshi
Sakshi News home page

సునీల్ నరైన్ స్థానంలో మిల్లర్

Published Sat, Jan 31 2015 12:36 AM

సునీల్ నరైన్ స్థానంలో మిల్లర్

దుబాయ్: ప్రపంచ కప్ కోసం ఎంపిక చేసిన వెస్టిండీస్ క్రికెట్ జట్టులో ఒక మార్పు చోటు చేసుకుంది. మిస్టరీ స్పిన్నర్ సునీల్ నరైన్ స్థానాన్ని నికిట మిల్లర్‌తో భర్తీ చేసేందుకు ఐసీసీ సాంకేతిక కమిటీ ఆమోద ముద్ర వేసింది. అసాధారణ పరిస్థితుల్లోనే ఇలాంటి మార్పులకు అంగీకరిస్తామని వెల్లడించింది.

కొత్త బౌలింగ్ శైలి కుదురుకునేందుకు తనకు మరింత సమయం పడుతుందని చెప్పి నరైన్ టోర్నీ నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. విండీస్ తరఫున 45 వన్డేలు ఆడిన 32 ఏళ్ల మిల్లర్ తన లెఫ్టార్మ్ స్పిన్‌తో 40 వికెట్లు తీశాడు. అతను గతేడాది మార్చిలో ఇంగ్లండ్‌పై చివరి వన్డే ఆడాడు. ఫిబ్రవరి 16న విండీస్ తన తొలి మ్యాచ్‌లో ఐర్లాండ్‌తో తలపడుతుంది.
 

Advertisement
Advertisement