మ్యాచ్‌లో అనూహ్యం.. పంత్‌ షూలేస్‌ ఊడటంతో!

11 May, 2019 10:31 IST|Sakshi

మైదానంలో వారిద్దరు ప్రత్యర్థులైనా.. మైదానం ఆవల వారిద్దరూ మంచి స్నేహితులు. అందుకే అతను ప్రత్యర్థి ఆటగాడు అయినా.. ఆడుతున్నది కీలకమైన క్వాలిఫైయర్‌ మ్యాచ్‌ అయినా.. అదేమీ పట్టించుకోకుండా రిషభ్‌ పంత్‌ షూస్‌ లేస్‌ ఉడిపోగానే.. వెంటనే సురేశ్‌ రైనా పరిగెత్తుకెళ్లి లేస్‌ కట్టాడు. వైజాగ్‌లో శుక్రవారం జరిగిన ఐపీఎల్‌ క్వాలిఫైయర్‌ మ్యాచ్‌ ఈ అరుదైన క్రీడాస్ఫూర్తికి వేదికగా నిలిచింది.

ఈ ఐపీఎల్‌ సీజన్‌లో దాదాపు అన్ని జట్లకు యువ క్రికెటర్‌ రిషభ్‌ పంత్‌ కొరకరానికొయ్యగా మిగిలాడు. బ్యాటింగ్‌లో అదరగొడుతున్న ఈ యంగ్‌స్టర్‌ చెన్నైతో మ్యాచ్‌లోనూ ఒంటరిపోరాటం చేసే ప్రయత్నం చేశాడు. చెన్నై బౌలర్లు ఢిల్లీ ఆటగాళ్లను ఇబ్బంది పెడుతూ.. వరుసగా పెవిలియన్‌కు తరలిస్తున్న క్రమంలో రిషభ్‌ పంత్‌ షూలేస్‌ ఊడిపోయాయి. క్రీజ్‌కు సమీపంలో ఫీల్డింగ్‌ చేస్తున్న రైనా ఇది గమనించి.. వెంటనే వచ్చి పంత్‌ షూ లేస్‌ కట్టాడు. ఇది క్రీడాభిమానులు మనస్సు దోచుకుంటోంది. పలువురు పంత్‌-రైనా మధ్య ఉన్న బాండింగ్‌ను మెచ్చుకుంటున్నారు. గత మ్యాచ్‌లో క్రీజ్‌లోకి వస్తున్న రైనాకు అడ్డుగా నిలబడి.. సరదాగా  పంత్‌ ఆటపట్టించిన సంగతి తెలిసిందే.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

అనధికార వ్యక్తులపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేస్తాం : ద్వివేదీ

ఇక ఆపండ్రా నాయనా.. ఆ ట్వీట్‌ తీసేశా!

బెంగాలీ సెంటిమెంట్‌పై ‘ఎన్నికల దాడి’

కోహ్లి తర్వాతే అతనే సరైనోడు..!

ఐపీఎల్‌ ఫైనల్‌ చాలా ‘హాట్‌’