బంగ్లాదేశ్‌లో ఆసియా కప్ టి20 | Sakshi
Sakshi News home page

బంగ్లాదేశ్‌లో ఆసియా కప్ టి20

Published Fri, Oct 30 2015 12:47 AM

T20 Asia Cup in Bangladesh

2018లో భారత్‌లో ఆసియా వన్డే కప్
 
ఢాకా/న్యూఢిల్లీ: టి20 ఫార్మాట్‌లో తొలిసారిగా ఆసియా కప్ జరుగబోతోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి, మార్చిలో జరిగే ఈ టోర్నీకి బంగ్లాదేశ్ ఆతిథ్యమివ్వనుంది. సింగపూర్‌లో ఇటీవల జరిగిన ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) సమావేశంలో ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు. పాకిస్తాన్ మొదట ఈ ప్రతిపాదన తేగా మిగిలిన సభ్య దేశాలు మద్దతిచ్చాయి. ఫిబ్రవరి 24 నుంచి మార్చి 6 వరకు జరిగే ఈ టోర్నీలో భారత్, పాక్, శ్రీలంక, బంగ్లాదేశ్‌లతో పాటు అర్హత పోటీలో నెగ్గిన యూఏఈ ఐదో జట్టుగా బరిలోకి దిగనుంది. మరోవైపు 2018లో జరిగే ఆసియా వన్డే కప్‌కు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది.

2019 ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ మెగా టోర్నీని ఇక్కడ జరపాలని నిర్ణయించినట్టు ఏసీసీ సమావేశంలో పాల్గొన్న బీసీసీఐ కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. ‘వచ్చే ఏడాది మార్చిలో భారత్‌లోనే టి20 ప్రపంచకప్ జరుగనుంది. దీనికి నెల రోజుల ముందు ఆసియా కప్ టి20 మంచి సన్నాహకంగా ఉపయోగపడుతుంది. పాక్‌లో అభద్రత, శ్రీలంకలో వర్షాలు దీంతో బంగ్లాకు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపాం. అలాగే 2018 ఆసియా వన్డే కప్ భారత్‌లో జరుగుతుంది’ అని ఠాకూర్ తెలిపారు. మరోవైపు ఆసియాలో నాలుగు టెస్టు దేశాల వార్షిక ఆదాయం నుంచి 2 శాతం నిధులను అసోసియేట్ దేశాల్లో క్రికెట్ అభివృద్ధి కోసం ఖర్చు చేయాలని నిర్ణయించారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement