భారత్ నిరీక్షణకు తెర | Sakshi
Sakshi News home page

భారత్ నిరీక్షణకు తెర

Published Mon, Feb 2 2015 10:24 AM

భారత్ నిరీక్షణకు తెర

ఫ్లాష్‌బ్యాక్ -2011

 భారత ఉపఖండం మూడోసారి ఆతిథ్యమిచ్చిన వరల్డ్‌కప్(2011). అయితే భద్రతా కారణాల రీత్యా పాకిస్తాన్ అవకాశాన్ని కోల్పోయింది. భారత్, శ్రీలంక, బంగ్లాదేశ్‌లలో మ్యాచ్‌లు జరిగాయి. ఈ టోర్నీలో సూపర్-8ను తీసి మళ్లీ క్వార్టర్ ఫైనల్‌తో నాకౌట్ దశను తీసుకొచ్చారు. అటు టీమిం డియా, ఇటు సచిన్‌ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించిన ప్రపంచకప్. ఫైన ల్లో ‘మాస్టర్’ విఫలమైనా... కీలకమైన క్వార్టర్స్, సెమీస్‌లలో అర్ధసెంచరీలతో జట్టును గెలిపించి టైటిల్ పోరులో భారత్‌ను నిలిపా డు. వాంఖడేలో లంకతో జరిగిన ఫైనల్లో కెప్టెన్ ధోని ఇన్నిం గ్స్ సంచలనమైతే... సిక్సర్‌తో చేజింగ్‌ను ముగించడం మరో విశేషం. ఉపఖండంలో జరిగిన గత ఈవెంట్ (1996)లో లంక గెలిస్తే... ఈసారి భారత్ గెలవడం కొసమెరుపు.
 
 

ఆతిథ్యం: భారత్, శ్రీలంక, బంగ్లాదేశ్; వేదికలు: 13
 పాల్గొన్న జట్లు (14): భారత్, పాకిస్తాన్, శ్రీలంక, వెస్టిం డీస్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, జింబాబ్వే, కెన్యా, బంగ్లాదేశ్, కెనడా, నెదర్లాండ్స్, ఐర్లాండ్.
 

Advertisement
Advertisement