'ఫైనల్లో బంగ్లాదేశ్‌ను కుమ్మేయండి' | Sakshi
Sakshi News home page

'ఫైనల్లో బంగ్లాదేశ్‌ను కుమ్మేయండి'

Published Fri, Feb 7 2020 8:23 PM

Team India Senior Cricketers Wish India U19 Team For World Cup Final - Sakshi

ఆక్లాండ్‌ : అండర్‌ 19 ప్రపంచకప్‌లో ఈ ఆదివారం ఇండియా, బంగ్లాదేశ్‌ మధ్య ఫైనల్‌ మ్యాచ్‌ దక్షిణాఫ్రికాలోని పాచెఫ్‌స్ట్రూమ్‌ లో సేన్వెస్ పార్క్‌లో జరగనున్న సంగతి తెలిసిందే. కాగా ఫైనల్‌ మ్యాచ్‌లో గెలిచి ఐదోసారి కప్పును ఒడిసి పట్టాలని భారత కుర్రాళ్లు భావిస్తుంటే, మరోవైపు బంగ్లాదేశ్‌ మాత్రం ఈ అవకాశాన్ని వదులుకోవద్దని భావిస్తుంది. ఈ నేపథ్యంలో పలువురు టీమిండియా సీనియర్‌ క్రికెటర్లు చటేశ్వర్‌ పుజార, అజింక్యా రహానే, విజయ్‌ శంకర్‌, వృద్దిమాన్‌ సాహాలు భారత కుర్రాళ్ల జట్టుకు ఆల్‌ ది బెస్ట్‌ చెప్పిన వీడియో ఒకటి బీసీసీఐ తన ట్విటర్‌లో షేర్‌ చేసింది. 'ముందుగా ఫైనల్‌ చేరినందుకు మీ అందరికి శుభాకాంక్షలు. ఈ ప్రపంచకప్‌లో ఇప్పటి వరకు ఓటమనేది ఎరుగకుండా జైత్రయాత్ర కొనసాగించారు. ఫైనల్లోనూ ఇదే తరహాలో ఆడి బంగ్లాదేశ్‌ను కుమ్మేయండి. ఈసారి కూడా కప్పు మనదే అవ్వాలి' అంటూ పేర్కొన్నారు.
(ఇదే రోజు పాకిస్తాన్‌పై అద్భుతం..)

కాగా సెమీఫైనల్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ను టీమిండియా కుర్రాళ్లు 10 వికెట్ల తేడాతో మట్టికరిపించి ఏడవ సారి ఫైనల్‌కు చేరుకుంది. ప్రసుత్తం టీమిండియా సీనియర్‌ జట్టు న్యూజిలాండ్‌ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. కివీస్‌తో జరగనున్న రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో ఆడేందుకు చటేశ్వర్‌ పుజారా, అజింక్యా రహానేలు ఇప్పటికే న్యూజిలాండ్‌కు చేరుకున్నారు. చటేశ్వర్‌ పుజారా 2006లో జరిగిన అండర్‌ 19 ప్రపంచకప్‌లో 349 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచి 'ప్లేయర్‌ ఆఫ్‌ ది టోర్నీ'గా ఎంపికయ్యాడు. అప్పటి ప్రపంచకప్‌ ఫైనల్‌ పాకిస్తాన్‌- ఇండియా మధ్య జరగ్గా, పాక్‌ 38 పరుగుల తేడాతో గెలిచి ప్రపంచకప్‌ను కైవసం చేసుకుంది. 
(బంగ్లాదేశ్‌ వచ్చేసింది )

Advertisement
Advertisement