మనింట్లో ధనాధన్ పండుగ | Sakshi
Sakshi News home page

మనింట్లో ధనాధన్ పండుగ

Published Mon, Mar 7 2016 1:45 AM

మనింట్లో ధనాధన్ పండుగ

గత నెల రోజు లుగా భారత జట్టు ఆడుతున్న టి20 మ్యాచ్‌లు, సాధిస్తున్న విజ యాలతో సంబరపడిపోతున్నాం. కానీ వాటన్నింటిని మించిన పోరాటం మన దగ్గర ప్రారంభం కాబోతోంది. టి20 ప్రపంచ సమరానికి భారత్ ఈసారి ఆతిథ్యం ఇస్తోంది. రేపటి నుంచి (మంగళవారం) ప్రపంచకప్ క్వాలిఫయింగ్ పోటీలు జరుగుతాయి. ఎనిమిది దేశాలు రెండు గ్రూప్‌లుగా విడిపోయి పోటీ  పడతాయి. రెండు గ్రూప్‌ల్లో విజేతలుగా నిలిచిన జట్లు ప్రధాన టోర్నీకి అర్హత సాధిస్తాయి.

ఇక అసలు టోర్నీలో 8 ప్రధాన జట్లతో పాటు ఈ రెండు జట్లు కూడా ఆడతాయి. దేశవ్యాప్తంగా ఏడు వేదికల్లో జరిగే ఈ మెగా టోర్నీ ఏప్రిల్ 3న కోల్‌కతాలో జరిగే ఫైనల్‌తో ముగుస్తుంది. 2007లో టి20 ప్రపంచకప్ తొలిసారి జరిగినప్పుడు ఈ ఫార్మాట్ చాలామందికి కొత్త. కానీ భారత్ ఆ టైటిల్ గెలవడంతో ఐపీఎల్ రూపంలో ప్రపంచం అబ్బురపడేలా టి20 లీగ్ వచ్చింది. దీంతో క్రికెట్ దిశ, దశ మారిపోయాయి.

ఆటగాళ్లపై కాసుల వర్షం కురుస్తోంది. ఇంతకాలం ప్రతి ఏటా ఐపీఎల్‌తో అంతులేని వినోదాన్ని అందుకుంటున్న భారత అభిమానులు ఈ ఏడాది ఐపీఎల్ కంటే ముందే ప్రపంచకప్ పండుగను ఆస్వాదించవచ్చు. తొలిసారి 2007లో టైటిల్ గెలిచిన తర్వాత భారత జట్టు 4 టోర్నీల్లో ఆడినా ఒక్కసారి మళ్లీ కప్‌ను అందుకోలేదు. తొలిసారి సొంతగడ్డపై జరుగుతున్న టి20 ప్రపంచకప్‌ను సాధించి... ధోనిసేన మరోసారి ము వ్వన్నెలను రెపరెపలాడించాలనేది కోట్లాది భారత అభిమానుల ఆశ, ఆకాంక్ష. ఇక రేపటి నుంచి ఈట్ క్రికెట్... స్లీప్ క్రికెట్...!

Advertisement
Advertisement