రన్నరప్‌ తెలంగాణ జట్లు | Sakshi
Sakshi News home page

రన్నరప్‌ తెలంగాణ జట్లు

Published Thu, Jan 4 2018 10:28 AM

telangana team as runnerup in fistball championship - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: జాతీయ జూనియర్‌ ఫిస్ట్‌బాల్‌ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ జట్లు ఆకట్టుకున్నాయి. బోడుప్పల్‌లోని పల్లవి మోడల్‌ స్కూల్‌ వేదికగా జరిగిన ఈ టోర్నమెంట్‌ బాలబాలికల విభాగాల్లో రన్నరప్‌గా నిలిచాయి. బాలుర ఫైనల్లో తెలంగాణ జట్టు 8–11, 9–11లో తమిళనాడు చేతిలో ఓడింది. బాలికల టైటిల్‌ పోరులో హిమాచల్‌ ప్రదేశ్‌ 11–7, 9–11, 11–8తో తెలంగాణపై గెలుపొంది విజేతగా నిలిచింది. బహుమతి ప్రదాన కార్యక్రమంలో మాజీ ఎంపీ వేణుగోపాలా చారి ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు ట్రోఫీలను అందజేశారు.

Advertisement
Advertisement