తెలుగు వెలుగులు | Sakshi
Sakshi News home page

తెలుగు వెలుగులు

Published Mon, Sep 29 2014 12:49 AM

తెలుగు వెలుగులు

ఇంచియాన్: సీనియర్లు లేకుండానే ఆసియా క్రీడల్లో అడుగుపెట్టిన భారత టెన్నిస్ ఆటగాళ్లు పతకాల పంట పండిస్తున్నారు. ముఖ్యంగా తెలుగు తేజం సాకేత్ మైనేని తాను బరిలోకి దిగిన రెండు ఈవెంట్లలోనూ ఫైనల్‌కు చేరి... కనీసం రెండు రజతాలు ఖాయం చేసుకున్నాడు. పురుషుల డబుల్స్‌లో సనమ్ సింగ్‌తో, మిక్స్‌డ్ డబుల్స్‌లో సానియా మీర్జాతో కలిసి అతను తుది పోరుకు చేరుకున్నాడు. సాకేత్ రెండు విభాగాల్లో మెరుగైన పతకాలు ఖరారు చేస్తే... మహిళల డబుల్స్‌లో సానియా జోడితోపాటు మరో రెండు విభాగాల్లో భారత క్రీడాకారులు కాంస్యాలతో సంతృప్తి చెందారు.
 ళీ పురుషుల డబుల్స్‌లో సనమ్ సింగ్, సాకేత్ మైనేని అద్భుత ఆటతీరుతో ఆకట్టుకున్నారు. సెమీస్‌లో ఈ జంట 4-6, 6-3, 10-6 తేడాతో టాప్ సీడ్ సంచాయ్ రతివతన, సోంచాత్ రతివతన (థాయ్‌లాండ్) జోడిని ఓడించి ఫైనల్‌కు చేరింది. మిక్స్‌డ్ డబుల్స్ సెమీఫైనల్లో సానియా మీర్జా, సాకేత్ మైనేని జంట 6-1, 6-3 తేడాతో జే జాంగ్-జీ జెంగ్ (చైనా)ను సునాయాసంగా ఓడించింది. ఈ రెండు విభాగాల్లో ఫైనల్లో ఓడినా రజతాలు దక్కుతాయి.
 ళీ    పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో యూకీ బాంబ్రీ అనవసర తప్పిదాలతో మూల్యం చెల్లించుకున్నాడు. 6-3, 2-6, 1-6 తేడాతో యొషిహిటో నిషికోవా (జపాన్) చేతిలో ఓడి కాంస్యంతో సరిపెట్టుకున్నాడు.
 ళీ    పురుషుల డబుల్స్ సెమీస్‌లో యూకీ బాంబ్రీ, దివిజ్ శరణ్ 7-6 (10/8), 6-7 (6/8), 9-11 తో హియాన్ చుంగ్-యోంగ్యు లిమ్ (కొరియా) చేతిలో ఓడారు. యూకీ-దివిజ్ రెండో సెట్‌లో రెండు... నిర్ణాయక ‘సూపర్ టైబ్రేక్’లో రెండుసార్లు మ్యాచ్ పాయింట్లను వదులుకోవడం గమనార్హం.
 ళీ    మహిళల డబుల్స్ సెమీస్‌లో సానియా మీర్జా-ప్రార్థన తొంబరే  జంట 7-6 (7/1), 2-6, 4-10 తేడాతో చిన్ వీ చాన్, సు వీ సీహిన్ (చైనీస్ తైపీ) చేతిలో  ఓడి కాంస్యంతో సరిపెట్టుకుంది.
 


 

Advertisement
Advertisement