టీమ్ కున్ ఘన విజయం

28 Oct, 2016 10:45 IST|Sakshi

ఎ- డివిజన్ వన్డే లీగ్  


 సాక్షి, హైదరాబాద్: బ్యాట్స్‌మెన్‌తో పాటు బౌలర్లు సమష్టిగా రాణించడంతో ఎ-డివిజన్ వన్డే లీగ్‌లో టీమ్‌కున్ జట్టు ఘనవిజయం సాధించింది. గురువారం విక్టోరియా జట్టుతో  జరిగిన మ్యాచ్‌లో 254 పరుగుల తేడాతో టీమ్ కున్ జట్టు గెలుపొందింది. మొదట బ్యాటింగ్ చేసిన టీమ్ కున్ 45 ఓవర్లలో 8 వికెట్లకు 366 పరుగులు చేసింది. విఘ్నేశ్వర్ (82), అనిరుధ్ (80), విహారి (61) అర్ధసెంచరీలతో రాణించారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన విక్టోరియా జట్టును టీమ్ కున్ బౌలర్లు కె. అనిరుధ్ (6/25), ధీరజ్ (3/29) నియంత్రించారు. వీరిద్దరి ధాటికి ఆ జట్టు 24.4 ఓవర్లలో 112 పరుగులకే కుప్పకూలింది.  రామకృష్ణ (48) చివరి వరకు పోరాడాడు.

 ఇతర మ్యాచ్‌ల స్కోర్లు
 ఎంపీ యంగ్‌మెన్: 224/7 (చారి 67), యూత్ సీసీ: 83 (నిహార్ 4/36, శివ 3/16).
 కాకతీయ సీసీ: 221 (సారుు 61; రిషద్ 3/36), రిషిరాజ్ సీసీ: 104 (మల్లికార్జున్ 40, రవి 3/14, రాజశేఖర్ 3/15).
 యూత్ సీసీ: 80 (రవి 5/37), కాకతీయ సీసీ: 83/3 .
 ఎంపీ స్పోర్టింగ్: 274 (రమాకాంత్ 79), సాక్రడ్ హార్ట్ సీసీ: 84 (సతీశ్ 3/6).
 గగన్ మహల్: 90 (చైతన్య 3/31, సిద్ధార్థ్ 3/23), మారేడుపల్లి బ్లూస్: 91/1 (స్వామి 53 నాటౌట్).
 సదరన్ స్టార్: 246 (యశ్వంత్ 69; కల్యాణ్ రావు 4/63, శైలేందర్ 4/11), సెయింట్ మేరీ సీసీ: 229 (శ్రీకర్ 72, చక్రవర్తి 5/52).
 ఎస్‌యూసీసీ: 234 (నితీశ్ 48, చంద్రశేఖర్ 4/57, నిఖిల్ 3/49), ఆజాద్‌సీసీ: 168 (స్వరూప్ 4/34).
 పీఎన్‌వై సీసీ: 193 (శ్రీకాంత్ 34, రాకేశ్ 4/37), విజయానగర్: 54( నర్సింహా 4/23, ఫహీముద్దీన్ 3/6).
 టీమ్‌కున్: 239 (వి. సహస్ర 67; సుశాంత్ 4/65), స్టార్‌లెట్స్: 128 (కార్తీశ్ 3/26).
 వాకర్స్ టౌన్ : 217/8 (సందీప్ 62, వంశీ 45; గంగాధర్ 3/20), ఎల్‌ఎన్‌సీసీ: 218/5 (ఓబుల్ రెడ్డి 88, ప్రతాప్ 63 నాటౌట్).
 సౌతెండ్ రేమండ్‌‌స: 160 (హాజీ 51, అఫాన్ 50నాటౌట్; సారన్ కశ్యప్ 5/13, నైరుత్ రెడ్డి 5/20), అమీర్ పేట్ సీసీ: 117 (అరుణ్‌కుమార్5/19).

 

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు