టీమిండియా అత్యల్ప స్కోర్లు ఇవే.. | Sakshi
Sakshi News home page

టీమిండియా అత్యల్ప స్కోర్లు ఇవే..

Published Sun, Dec 10 2017 3:43 PM

top 10 Indias lowest totals in ODIs - Sakshi

ధర్మశాల:మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఇక్కడ శ్రీలంకతో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా 112 పరుగులకే ఆలౌటైన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ఎంఎస్‌ ధోని(65; 87 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్సర్లు) బాధ్యతాయుత ఇన్నింగ్స్‌ ఆడటంతో టీమిండియా అత్యల్ప స్కోరు బారిన పడకుండా పరువు నిలుపుకుంది. ఓవరాల్‌గా చూస్తే వన్డేల్లో భారత్‌ అత్యల్ప స్కోరు 54(శ్రీలంకపై), కాగా, స్వదేశంలో టీమిండియా అత్యల్ప స్కోరు 78(శ్రీలంకపై)గా ఉంది. తాజా స్కోరు భారత్‌కు 14వ అత్యల్పస్కోరుగా రికార్డు పుస్తకాల్లోకెక్కింది. ఇదిలా ఉంచితే,  వన్డేల్లో టీమిండియా టాప్‌-10 అత్యల్ప స్కోర్లు వివరాలు ఇలా ఉన్నాయి.

1. స్కోరు(54)-ఓవర్లు(26.3 ఓవర్లు)- ప్రత్యర్థి శ్రీలంక- వేదిక షార్జా-తేదీ 29/10/2000

2.స్కోరు(63)-ఓవర్లు(25.5)-ప్రత్యర్థి ఆస్ట్రేలియా-వేదిక సిడ్నీ- తేదీ 08/01/81

3..స్కోరు(78)-ఓవర్లు(24.1)- ప్రత్యర్థి శ్రీలంక-వేదిక కాన్పూర్‌-తేదీ 24/12/86

4..స్కోరు(79)-ఓవర్లు(34.2)-ప్రత్యర్థి పాకిస్తాన్‌- వేదిక సియాకాట్‌-తేదీ 13/10/78

5. స్కోరు(88)- ఓవర్లు(29.3)- ప్రత్యర్థి న్యూజిలాండ్‌- వేదిక దంబుల్లా- తేదీ 10/08/10

6. స్కోరు(91)- ఓవర్లు(29.1.)- ప్రత్యర్థి దక్షిణాఫ్రికా- వేదిక డర్బన్‌-తేదీ 22/11/06

7.స్కోరు(100)- ఓవర్లు(36.3)-ప్రత్యర్థి ఆస్ట్రేలియా-వేదిక సిడ్నీ- తేదీ 14/01/2000

8. స్కోరు(100)-ఓవర్లు(28.3)-ప్రత్యర్థి వెస్టిండీస్‌-వేదిక అహ్మదాబాద్‌- తేదీ16/11/93

9. స్కోరు(103)- ఓవర్లు(33.4)-ప్రత్యర్థి శ్రీలంక-వేదిక దంబుల్లా-తేదీ 22/08/10

10.స్కోరు(103)- ఓవర్లు(26.3)-ప్రత్యర్థి శ్రీలంక-వేదిక కొలంబో- తేదీ 29/08/08

Advertisement

తప్పక చదవండి

Advertisement