పన్నెండున్నరేళ్ల తర్వాత | Sakshi
Sakshi News home page

పన్నెండున్నరేళ్ల తర్వాత

Published Sun, Sep 7 2014 12:33 AM

పన్నెండున్నరేళ్ల తర్వాత

ఓ టోర్నీ గెలిచిన దక్షిణాఫ్రికా  
 ముక్కోణపు టోర్నీ ఫైనల్లో ఆసీస్‌పై విజయం

 
 హరారే: దక్షిణాఫ్రికా జట్టు పన్నెండున్నర సంవత్సరాల తర్వాత ఓ టోర్నీ టైటిల్ గెలవగలిగింది. 2002 ఫిబ్రవరిలో ఆస్ట్రేలియాలో ముక్కోణపు టోర్నీ టైటిల్ గెలిచాక సఫారీలు ఎక్కడా ఏ వన్డే టోర్నీ టైటిల్ గెలవలేదు. ద్వైపాక్షిక సిరీస్‌లు మాత్రం గెలిచారు. ఈ లోటును శనివారం తీర్చుకున్నారు. డుఫ్లెసిస్ (99 బంతుల్లో 96; 8 ఫోర్లు; 1 సిక్స్) విజృంభణతో ముక్కోణపు టోర్నీ ఫైనల్లో దక్షిణాఫ్రికా 6 వికెట్లతో ఆస్ట్రేలియాపై గెలిచింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్ 50 ఓవర్లలో తొమ్మిది వికెట్లకు 217 పరుగులు చేసింది.

 పేసర్ డేల్ స్టెయిన్ (4/34) ధాటికి ఆసీస్ బ్యాటింగ్ ఆర్డర్ కుప్పకూలింది. ఓపెనర్ ఫించ్ (87 బంతుల్లో 54; 5 ఫోర్లు) మాత్రమే రాణించాడు. చివర్లో ఫాల్క్‌నర్ (37 బంతుల్లో 39; 4 ఫోర్లు) ఆకట్టుకున్నాడు. మోర్కెల్, పార్నెల్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా 40.5 ఓవర్లలో నాలుగు వికెట్లకు 221 పరుగులు చేసి నెగ్గింది. ఆమ్లా (75 బంతుల్లో 51; 2 ఫోర్లు), డివిలియర్స్ (41 బంతుల్లో 57; 6 ఫోర్లు; 2 సిక్సర్లు) అర్ధ సెంచరీలు చేశారు. నాలుగో వికెట్‌కు డివిలియర్స్, డు ప్లెసిస్ కలిసి 91 పరుగులు జత చేశారు. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌తో పాటు సిరీస్ కూడా డు ప్లెసిస్‌కు దక్కింది.
 

Advertisement
Advertisement