10 ఓవర్లలో యూఏఈ స్కోరు 28/2 | Sakshi
Sakshi News home page

10 ఓవర్లలో యూఏఈ స్కోరు 28/2

Published Sat, Feb 28 2015 12:54 PM

uae gets 28 runs in 10 overs

పెర్త్: వన్డే వరల్డ్ కప్ లో భాగంగా ఇక్కడ శనివారం టీమిండియాతో  జరుగుతున్న మ్యాచ్ లో యూఏఈ పది ఓవర్లు ముగిసేసరికి రెండు వికెట్లు కోల్పోయి 28 పరుగులు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న యూఏఈ ఆదిలోనే వికెట్లను చేజార్చుకుంది. ఓపెనర్లు అమ్ జద్ అలీ(4), బెరంగర్లు(4)పరుగులు చేసి పెవిలియన్ కు చేరారు. టీమిండియా బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ కు, ఉమేష్ యాదవ్ కు తలో వికెట్ దక్కింది. ఇప్పటికే రెండు విజయాలతో గ్రూప్ బి నుంచి టీమిండియా అగ్రస్థానంలో ఉండగా, యూఏఈ ఇంకా ఖాతా తెరవలేదు.

Advertisement
Advertisement