భారత్కు బ్రేక్ ఇచ్చిన ఉమేష్ | Sakshi
Sakshi News home page

భారత్కు బ్రేక్ ఇచ్చిన ఉమేష్

Published Sun, Feb 15 2015 3:26 PM

umesh shines

అడిలైడ్: 23 ఓవర్లలో పాకిస్థాన్ స్కోరు 101/2. భారత బౌలర్లు పొదుపుగా బౌలింగ్ చేస్తున్నా.. వికెట్ పడలేదే అని భారత అభిమానుల్లో ఉత్కంఠ. భారత కెప్టెన్ ధోనీ బంతి ఉమేష్కు ఇచ్చాడు. ఉమేష్ అంతకుముందు 4 ఓవర్లు వేసినా పెద్దగా ప్రభావం చూపించలేకపో్యాడు. అయితే ఇన్నింగ్స్ 24వ ఓవర్లో ఉమేష్ అద్భుతం చేశాడు. ఇదే ఓవర్లో రెండు కీలక వికెట్లు పడగొట్టి టీమిండియాకు బ్రేక్ ఇచ్చాడు. ఉమేష్.. షెహజాద్, షోయబ్ మఖ్సూద్ను పెవిలియన్ బాట పట్టించాడు. షెహజాద్ క్యాచ్ను జడేజా అద్భుతంగా ఒడిసిపట్టుకున్నాడు. ఓ దశలో జడేజా క్యాచ్ డ్రాప్ చేసినట్టు అనిపించినా వెంటనే పట్టుకోవడంతో టీమిండియా ఊపిరి పీల్చుకుంది. ఇక మఖ్సూద్ .. రైనాకు దొరికిపోయాడు. ఆ వెంటనే జడేజా బౌలింగ్ లో ఉమర్ అక్మల్ అవుటయ్యాడు. అంతే పాకిస్థాన్ పాకిస్థాన్ పీకల్లోతు కష్టాల్లోపడింది. పాక్  25 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 105 పరుగులే చేయగలిగింది.


భారత్ ఆరంభంలోనే పాక్ వికెట్ తీసింది. యువ పేసర్ షమీ ఇన్నింగ్స్ 4వ ఓవర్లో యూనస్ ఖాన్(6) ను అవుట్ చేశాడు. యూనస్.. ధోనికి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఆనక ప్రమాదకరంగా పరిణమిస్తున్న షెహజాద్, హారిస్ సొహైల్ జోడీని అశ్విన్ విడదీసి మెయిడిన్ వికెట్ తీశాడు. అశ్విన్ బౌలింగ్లో సొహైల్.. రోహిత్ శర్మకు క్యాచిచ్చాడు. ప్రపంచ కప్ గ్రూపు-బిలో భాగంగా ఆదివారం జరుగుతున్న మ్యాచ్లో.. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ దిగిన టీమిండియా 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 300 పరుగులు చేసింది.

Advertisement
Advertisement