భారత్‌కు ఐదో స్థానం

28 Feb, 2014 01:08 IST|Sakshi
భారత్‌కు ఐదో స్థానం

అండర్-19 ప్రపంచకప్
 షార్జా : డిఫెండింగ్ చాంపియన్ భారత్ అండర్-19 ప్రపంచకప్‌లో ఐదో స్థానంతో సరిపెట్టుకుంది. షార్జా క్రికెట్ స్టేడియంలో జరిగిన ప్లే ఆఫ్ మ్యాచ్‌లో భారత్ 46 పరుగుల తేడాతో వెస్టిండీస్‌పై విజయం సాధిం చింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్ 8 వికెట్లకు 340 పరుగుల భారీ స్కోరు చేసింది.
 
 ఓపెనర్ అంకుశ్ బైన్స్ (74), సంజూ శామ్సన్ (67), శ్రేయాస్ అయ్యర్ (66) అర్ధ సెంచరీలతో రాణించారు. ఆ తర్వాత బరిలోకి దిగిన వెస్టిండీస్ 8 వికెట్లు కోల్పోయి 294 పరుగులు మాత్రమే చేయగలిగింది.తేజ్‌నారాయణ్ చందర్‌పాల్ సెంచరీ (136 బంతుల్లో 112, 8 ఫోర్లు, 1 సిక్సర్)తో రాణించినా.. కోల్మన్ (45), పూరన్ (54) మినహా మిగిలిన బ్యాట్స్‌మెన్ రాణించలేకపోయారు. భారత్ చేతిలో ఓడిన వెస్టిండీస్ ఈ టోర్నీలో ఆరో స్థానంలో నిలిచింది.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా