ఉమ్మడిగా అగ్రస్థానంలో వరుణ్‌

12 Feb, 2017 10:18 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: బ్రిలియంట్‌ ట్రోఫీ ఓపెన్‌ చెస్‌ టోర్నమెంట్‌లో వి. వరుణ్‌ అగ్రస్థానంలో ఉన్నాడు. దిల్‌సుఖ్‌నగర్‌లో జరుగుతోన్న ఈ చాంపియన్‌షిప్‌ ఓపెన్‌ కేటగిరీలో 3 రౌండ్లు ముగిసేసరికి 3 పాయింట్లతో మరో నలుగురితో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. కె. తరుణ్, ఎల్‌. సతీశ్‌ కుమార్, పి.రవీందర్, నీరజ్‌ అనిరుధ్‌లు కూడా 3 పాయింట్లతో ఉన్నారు. జూనియర్‌ విభాగంలో ఏకంగా ఏడుగురు చిన్నారులు 3 పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నారు. జి.శివాని, అద్వైత శర్మ, రిత్విక్, మైత్రి, హిమేశ్, రఘురామ్‌ తలా 3 పాయింట్లు సాధించారు. శనివారం జూనియర్‌ విభాగంలో జరిగిన మూడోరౌండ్‌లో అద్వైత శర్మ (3)... చిద్విలాస్‌ సాయి (2)పై, రిత్విక్‌ (3)... ప్రణవ్‌ (2)పై, రఘురామ్‌ రెడ్డి (3)... బిల్వ నిలయ (2)పై, మైత్రి (3)... రోహిత్‌ (2)పై, హిమేశ్‌ (3)... రిషి (2)పై గెలుపొందారు.

ఓపెన్‌ విభాగంలో మూడో రౌండ్‌ ఫలితాలు

వరుణ్‌ (3)... ప్రణీత్‌ (2)పై, తరుణ్‌ (3)... త్రిష (2)పై, సతీశ్‌ (3)... రాజు (2)పై గెలిచారు. సాయికృష్ణ (2.5)తో జరిగిన గేమ్‌ను సురేశ్‌ (2.5)... ప్రతీక్‌ (2.5)తో జరిగిన గేమ్‌ను సుబ్బరాజు (2.5) డ్రాగా ముగించారు.    
 

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా