వికాస్, మనోజ్‌లకు రియో బెర్త్‌లు | Sakshi
Sakshi News home page

వికాస్, మనోజ్‌లకు రియో బెర్త్‌లు

Published Fri, Jun 24 2016 12:32 AM

వికాస్, మనోజ్‌లకు రియో బెర్త్‌లు

బాకు: వికాస్ క్రిషన్ (75కేజీ), మనోజ్ కుమార్ (64కేజీ)లకు ఒలింపిక్ బెర్త్‌లు ఖరారయ్యాయి.  ఐబా ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రపంచ క్వాలిఫయింగ్ టోర్నీలో వీరిద్దరు సెమీఫైనల్స్‌కు చేరారు. క్వార్టర్ ఫైనల్స్‌లో వికాస్ 3-0తో లీ డోంగ్యున్ (కొరియా)ను ఓడించగా.. మనోజ్ 3-0తో రఖిమోవ్ షవ్‌కట్‌జోన్ (తజకిస్తాన్)పై నెగ్గాడు.

ప్రస్తుతం భారత్ నుంచి ఈ ఇద్దరితో పాటు శివథాపా రియోకు అర్హత సాధించాడు. 75 కేజీల విభాగంలో వికాస్ అర్హత సాధిచినందున... ప్రొఫెషనల్ బాక్సర్‌గా మారిన విజేందర్‌కు ఇక రియో అవకాశం లేదు.

Advertisement
Advertisement