వైరల్‌ : విరుష్కల సెల్ఫీ | Sakshi
Sakshi News home page

వైరల్‌ : విరుష్కల సెల్ఫీ

Published Wed, Jul 11 2018 9:14 PM

Virat Kohli And Anushka Sharma Selfie Photo Viral - Sakshi

నాటింగ్‌హామ్ ‌: సుదీర్ఘ ఇంగ్లండ్‌ పర్యటనలో తొలి అంకాన్ని పూర్తి చేసిన కోహ్లి ఆండ్‌ గ్యాంగ్‌ కాస్త ఖళీ సమయం‍ దొరకడంతో సేద తీరుతోంది. వన్డే సిరీస్‌ ప్రారంభమయ్యే ముందు టీమిండియా ఆటగాళ్లు ఇంగ్లండ్‌ వీధుల్లో విహరించారు. ఇక ధోని, కోహ్లిలు వారివారి సతీమణులతో కలిసి ఎంజాయ్‌ చేశారు. ఆదివారం జరిగిన మూడో టీ20లో అనుష్క శర్మ, సాక్షి చేసిన హడావుడి.. విజయానంతరం కోహ్లి తన సతీమణికిచ్చిన ఫ్లైయింగ్‌ కిస్‌.. మ్యాచ్‌ అనంతరం అనుష్క కోహ్లిని కౌగిలించుకోవడం, వీటికి సంబంధించిన ఫోటోలో, వీడియోలు నెట్టింట్లో హల్‌ చల్‌ చేస్తున్నాయి. ఈ తరుణంలోని మరో సెల్ఫీ వైరల్‌ అవుతోంది.

ఈ సారి కోహ్లి వంతు.. అనుష్క- కోహ్లి జోడి సోషల్‌ మీడియాలో ఆక్టీవ్‌గా ఉంటారన్న విషయం తెలిసిందే. వారికి సంబంధించిన ప్రతీ విషయాన్ని అభిమానులతో పంచుకుంటారు. తాజాగా ఈ జంట ఇంగ్లండ్‌లో ఎంజాయ్‌ చేస్తూ షేర్‌ చేసిన సెల్ఫీ ఫోటో అభిమానులను ఆకట్టుకుంటోంది. అనుష్క కోహ్లికి ముద్దుపెట్టిన సెల్ఫీని ‘డే ఔట్‌ విత్‌ మై బ్యూటీ’ అంటూ కోహ్లీనే స్వయంగా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశాడు.  ఈ ఫొటోకు క్షణాల్లోనే లక్షల లైక్‌లు లభించాయి. అభిమానుల నుంచి కూడా మంచి స్పందన వస్తోంది. ఇక వరుస విజయాలతో దూసుకపోతున్న ఈ జంట చిరకాలం సంతోషంగా ఉండాలని నెటిజన్లు కోరుకుంటున్నారు.    

Day out with my beauty! 🤩♥️

A post shared by Virat Kohli (@virat.kohli) on

Advertisement
Advertisement