విరాట్‌ కోహ్లి మూడో‘సారీ’

15 Nov, 2019 10:42 IST|Sakshi

ఇండోర్‌: బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి నిరాశపరిచాడు. భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో భాగంగా నాల్గో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన కోహ్లి డకౌట్‌గా పెవిలియన్‌ చేరాడు. తాను ఎదుర్కొన్న రెండో బంతికే కోహ్లి ఔటయ్యాడు. అబు జాయెద్‌ వేసిన 32 ఓవర్‌ ఐదో బంతికి కోహ్లి ఎల్బీగా నిష్క్రమించాడు. కాగా, కోహ్లి ఇలా స్వదేశీ టెస్టుల్లో డకౌట్‌గా వెనుదిరగడం మూడోసారి మాత్రమే. గతంలో 2016-17 సీజన్‌లో ఆసీస్‌తో పుణెలో జరిగిన మ్యాచ్‌లో మిచెల్‌ స్టార్క్‌ బౌలింగ్‌లో డకౌటైన కోహ్లి.. 2017-18 సీజన్‌లో శ్రీలంకతో కోల్‌కతాలో జరిగిన మ్యాచ్‌లో సురంగా లక్మల్‌ బౌలింగ్‌లో సున్నాకే ఔటయ్యాడు. 

కోహ్లి ఔట్‌తో భారత్‌ జట్టు 119 పరుగులకే మూడో వికెట్‌ను కోల్పోయింది.  అంతకుముందు చతేశ్వర్‌ పుజారా(54) రెండో వికెట్‌గా ఔటయ్యాడు. హాఫ్‌ సెంచరీ సాధించిన తర్వాత పుజారా అబు జాయెద్‌ బౌలింగ్‌లో పెవిలియన్‌ చేరాడు. 86/1 ఓవర్‌ నైట్‌ స్కోరుతో రెండో రోజు ఆట కొనసాగించిన భారత్‌ ఆచితూచి ఆడింది. పుజారా, మయాంక్‌ అగర్వాల్‌ భారత్‌ ఇన్నింగ్స్‌ను నెమ్మదిగా ముందుకు తీసుకెళ్లారు. ఈ క్రమంలోనే పుజారా హాఫ్‌ సెంచరీ చేసుకోగా, మయాంక్‌ అగర్వాల్‌ సైతం అర్థం శతకం పూర్తి చేసుకున్నాడు.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు