కోహ్లి సేనకు పట్టు దొరికింది.. | Sakshi
Sakshi News home page

కోహ్లి సేనకు పట్టు దొరికింది..

Published Sun, Sep 25 2016 12:09 PM

కోహ్లి సేనకు పట్టు దొరికింది..

కాన్పూర్: న్యూజిలాండ్ తో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో భారత జట్టుకు పట్టు దొరికింది. తొలి ఇన్నింగ్స్లో నిలకడలేమితో సతమతమైన కోహ్లి సేన..  రెండో ఇన్నింగ్స్లో భారీ స్కోరు దిశగా పయనిస్తోంది.  నాల్గో రోజు ఆటలో భాగంగా లంచ్ సమయానికి భారత్ నాలుగు వికెట్ల నష్టానికి 252 పరుగులు చేసింది.  దాంతో కోహ్లి అండ్ గ్యాంగ్కు ఓవరాల్ గా 308 పరుగుల ఆధిక్యం లభించింది.

159/1 ఓవర్ నైట్ స్కోరుతో ఆదివారం రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన టీమిండియాకు ఆరంభంలో మురళీ విజయ్, చటేశ్వర పూజారాలు నిలకడైన ఆట తీరుతో ఆకట్టుకున్నారు. అయితే  విజయ్(76;170 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్స్)  ను ఊరించి బంతితో సాంట్నార్ బోల్తా కొట్టించాడు. ఆ తరువాత కెప్టెన్ విరాట్ కోహ్లి(18;40 బంతుల్లో 3 ఫోర్లు) టచ్ లోకి వచ్చినట్లు కనిపించినా, స్వీప్ షాట్ కు యత్నించి అవుటయ్యాడు. కోహ్లి అవుటైన కాసేపటికే పూజారా(78;152 బంతుల్లో 10 ఫోర్లు) నాల్గో వికెట్ గా నిష్క్రమించాడు. ఆపై అజింక్యా రహానే- రోహిత్ శర్మ జోడీలు కుదురుగా బ్యాటింగ్ చేయడంతో భారత్ మరో వికెట్ కోల్పోకుండా జాగ్రత్త పడింది.

Advertisement
Advertisement