కోహ్లి.. మరో ట్రంప్‌! | Sakshi
Sakshi News home page

కోహ్లి.. మరో ట్రంప్‌!

Published Tue, Mar 21 2017 11:47 PM

కోహ్లి.. మరో ట్రంప్‌! - Sakshi

భారత కెప్టెన్‌పై ఆసీస్‌ మీడియా అక్కసు  

న్యూఢిల్లీ: స్టీవ్‌ స్మిత్‌ డ్రెస్సింగ్‌ రూమ్‌ రివ్యూపై గళమెత్తినప్పటి నుంచి భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లిపై ఆస్ట్రేలియా మీడియా తమ అక్కసును వెళ్లగక్కుతూనే ఉంది. ఏదో ఒక అసత్య ఆరోపణలతో కథనాలను ప్రచురిస్తోంది. తాజాగా అతడిని వివాదాస్పద నిర్ణయాలతో వార్తల్లోకెక్కుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో పోల్చింది. టెస్టు సిరీస్‌లో ఆసీస్‌ ఆటగాళ్లు మోసానికి పాల్పడుతున్నారని కోహ్లి ఆరోపించిన సంగతి తెలిసిందే.

అయితే దీనిపై అతను క్షమాపణ చెప్పేందుకు, తగిన సాక్ష్యాలను చూపించేందుకు నిరాకరించాడు. ‘ప్రపంచ క్రికెట్‌లో విరాట్‌ కోహ్లి మరో డొనాల్డ్‌ ట్రంప్‌గా మారాడు. ఎందుకంటే ట్రంప్‌లాగే తాను కూడా ముఖంపై ఉన్న కోడి గుడ్డు మరకలను దాచుకుంటూ మీడియాను అవమానపరచాలని నిర్ణయించుకున్నాడు’ అని ది డెయిలీ టెలిగ్రాఫ్‌ పత్రిక పేర్కొంది. 

Advertisement

తప్పక చదవండి

Advertisement