'కోహ్లి..నువ్వు కొంచెం తగ్గితే మంచిది' | Sakshi
Sakshi News home page

'కోహ్లి..నువ్వు కొంచెం తగ్గితే మంచిది'

Published Thu, Feb 15 2018 10:43 AM

virat Kohli needs to tone down a bit as a leader, says Jacques Kallis - Sakshi

కేప్‌టౌన్‌:భారత క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి దూకుడుకు మారుపేరు. మైదానం లోపలా, బయటా అతను దూకుడుగా కనిపిస్తాడు. బ్యాటింగ్‌లో ప్రత్యర్థి బౌలర్లపై నిర్థాక్షిణ్యంగా దాడి చేసే కోహ్లి.. తనను కవ్సిస్తే మాత్రం మాటలతోనూ అవతలి జట్టు ఆటగాళ్లపై ఎదురుదాడికి దిగడంలో వెనుకాడడు. అయితే,  కెప్టెన్‌గా కోహ్లి కొంచెం తగ్గి ఉంటేనే మంచిదని దక్షిణాఫ్రికా దిగ్గజ క్రికెటర్‌ జాక్వస్‌ కల్లిస్‌ సూచించాడు. భారత జట్టును ముందుకు తీసుకెళ్లాలంటే కోహ్లి దూకుడును తగ్గించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నాడు.

'ఆటగాడిగా ఉన్నట్టు నాయకుడిగా ప్రతీసారి దూకుడుగా ఉండకూడదు. ఈ విషయం కోహ్లి తెలుసుకోవాలి. సారథిగా అతనింకా కొత్తే. అనుభవం గడించే కొద్దీ విరాట్‌ ప్రశాంతంగా ఉండడం అలవరుచుకుంటాడని భావిస్తున్నా. అయితే, ఆటపై అతని అంకితభావం చాలా ఎక్కువ. భవిష్యత్‌లో భారత జట్టు మరింత మెరుగ్గా తయారవుతుంది' అని కల్లిస్‌ పేర్కొన్నాడు.

Advertisement
Advertisement