కోహ్లిపై సచిన్ ప్రశంసలు | Sakshi
Sakshi News home page

కోహ్లిపై సచిన్ ప్రశంసలు

Published Fri, May 27 2016 6:51 PM

కోహ్లిపై సచిన్ ప్రశంసలు

దుబాయ్: భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లిపై మాస్టర్ బ్లాస్టర్  సచిన్ టెండూల్కర్ ప్రశంసల వర్షం కురిపించాడు. అతనికి ఆటపై ఉన్న క్రమశిక్షణ, నిబద్ధతే  క్రికెట్  ప్రపంచంలో ఒక ఉన్నతస్థానంలో  నిలిపిందన్నాడు.  జట్టు ఒత్తిడిలో ఉన్న సమయంలో విరాట్ మానసికంగా చాలా దృఢంగా ఉంటాడని సచిన్ కొనియాడాడు. ' విరాట్ స్టైట్ బ్యాట్తో ఆడే విధానం చాలా ముచ్చటగా ఉంటుంది. స్టైట్ బ్యాట్ లో కచ్చితమైన క్రికెటింగ్ షాట్లతో విరాట్ అలరిస్తాడు. విరాట్ స్ట్రైట్ బ్యాట్ తో ఆడేటప్పుడు టెక్నిక్ విషయంలో ఎప్పుడూ రాజీ పడడు.  ఇది మూడు ఫార్మాట్లలో మనకు కనిపిస్తుంది' అని సచిన్ ప్రశంసించాడు. విరాట్ లో ప్రత్యేకమైన టాలెంట్ ఉండటంతో పాటు, నిరంతరం తీవ్రంగా శ్రమిస్తూ ఉండటమే అతని సక్సెస్ సీక్రెట్ అని సచిన్ పేర్కొన్నాడు.

ఇదిలా ఉండగా, ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) నాణ్యమైన క్రికెట్తో ముందుగా సాగడంపై సచిన్ హర్షం వ్యక్తం చేశాడు. ప్రతీ జట్టుకు పోటాపోటీ విజయాలతో ముందుకెళ్లే  అవకాశాలు రావడమే ఐపీఎల్ విజయ సూత్రమని సచిన్ అభిప్రాయపడ్డాడు. చివరి లీగ్ మ్యాచ్‌ ముగిసేవరకు  ప్లే ఆఫ్ బెర్తుపై స్పష్టత రాకపోవడమే ఐపీఎల్పై  ఆదరణ పెరగడానికి కారణమన్నాడు.

Advertisement
Advertisement