బ్రియన్‌ లారా రికార్డ్‌ బ్రేక్‌

29 Jan, 2018 10:39 IST|Sakshi
టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి

జొహన్నెస్‌బర్గ్‌: టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి మరో ఘనత సాధించాడు. ఆల్‌టైమ్‌ టెస్ట్‌ కెరీర్‌-హై ప్లేయర్‌ ర్యాంకింగ్స్‌ లిస్టులో వెస్టిండీస్‌ దిగ్గజ క్రికెటర్‌ బ్రియన్‌ లారాను అధిగమించాడు. 912 పాయింట్లతో ఈ జాబితాలో 26వ స్థానంలో నిలిచాడు. దక్షిణాఫ్రికాతో జొహన్నెస్‌బర్గ్‌లో జరిగిన చివరి టెస్టు ద్వారా 12 ర్యాంకింగ్‌ పాయింట్లు సాధించాడు. అంతకుముందు అతడి ఖాతాలో 900 పాయింట్లు ఉన్నాయి. ఈ మ్యాచ్‌ రెండు ఇన్నింగ్స్‌లో విరాట్‌ 54, 41 పరుగులు చేశాడు. దీంతో 12 ర్యాంకింగ్‌ పాయింట్లు జతకావడంతో 912 పాయింట్లతో 31వ స్థానం నుంచి 26వ స్థానానికి చేరుకున్నాడు. ఈ క్రమంలో లారా(911), కెవిన్‌ పీటర్సన్‌(909), హషిమ్‌ ఆమ్లా(907), శివనారాయణ్‌ చంద్రపాల్‌(901), మైకేల్‌ క్లార్క్‌(900)లను అధిగమించాడు. మరో ఐదు పాయింట్లు సాధిస్తే సునీల్‌ గవస్కర్(916)ను కూడా అధిగమిస్తాడు.

ఆల్‌టైమ్‌ టెస్ట్‌ కెరీర్‌- హై ప్లేయర్‌ ర్యాంకింగ్స్‌ లిస్టులో ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్‌ డాన్‌ బ్రాడ్‌మన్‌ 961 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ప్రస్తుతం ఐసీసీ టెస్టు ర్యాంకుల్లో నంబర్‌వన్‌ స్థానంలో ఉన్న ఆసీస్‌ కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌ 947 పాయింట్లతో రెండో స్థానం దక్కించుకున్నాడు.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘అతడి ముచ్చటంటే కోహ్లికి ఇష్టమంటా’

లాక్‌డౌన్‌: ‘ఏం చేస్తున్నావ్‌ స్మిత్‌’

లాక్‌డౌన్‌: ‘ఖైదీననే భావన కలుగుతోంది’

జూలై వరకు బ్యాడ్మింటన్‌ టోర్నీల్లేవు: బీడబ్ల్యూఎఫ్‌ 

శ్రేయస్‌ టీనేజ్‌లో జరిగింది ఇది!

సినిమా

కరోనాపై పోరాటం: సూపర్‌ స్టార్ల షార్ట్‌ఫిల్మ్‌

దేశం కోసం ఓ మంచి పని చేద్దాం : కాజల్‌

కరోనా విరాళం

కూతురి కోసం...

తమ్మారెడ్డి భరద్వాజకు మాతృ వియోగం

శ్రీలక్ష్మి కనకాల ఇకలేరు