మూడో రోజు నుంచి ‘తిరుగుడే’! | Sakshi
Sakshi News home page

మూడో రోజు నుంచి ‘తిరుగుడే’!

Published Wed, Nov 16 2016 12:18 AM

మూడో రోజు నుంచి ‘తిరుగుడే’!

వైజాగ్‌లో స్పిన్ పిచ్ సిద్ధం

విశాఖపట్నం నుంచి సాక్షి క్రీడా ప్రతినిధి  ‘ఇంగ్లండ్ వెళితే స్పోర్టింగ్ పిచ్ పేరుతో సాధారణ పిచ్‌లు తయారు చేస్తారా..? వాళ్లకు అనుకూలమైన వికెట్లే తయారు చేసుకుంటారు. అలాంటప్పుడు మనం స్పిన్ పిచ్‌లు తయారు చేస్తే తప్పేంటి..? ఎందుకు ఇలాంటి వికెట్‌లు..? మూడో రోజు నుంచే స్పిన్ తిరగాలి’.. రాజ్‌కోట్‌లో తొలి టెస్టు తర్వాత భారత బృందం మాట ఇది. ఇంగ్లండ్ జట్టు బలహీనత, మన బలం కూడా స్పిన్ కాబట్టి కచ్చితంగా అన్ని వేదికల్లో స్పిన్ పిచ్‌లు ఉంటాయని సిరీస్ ఆరంభానికి ముందు భావించారు. కానీ అనూహ్యంగా తొలి టెస్టుకు రాజ్‌కోట్‌లో ఫ్లాట్ పిచ్ ఎదురరుుంది.

ఆఖరి రోజు మాత్రమే స్పిన్ తిరిగింది. ఈ నేపథ్యంలో బీసీసీఐ నుంచి మిగిలిన టెస్టు మ్యాచ్‌ల వేదికల క్యూరేటర్స్‌కు స్పిన్ ట్రాక్‌లు సిద్ధం చేయాలనే ఆదేశాలు వస్తాయని భావించారు. అరుుతే తమకు అలాంటి ఆదేశాలు ఏమీ రాలేదని విశాఖ క్యూరేటర్ నాగమల్లే శ్వరరావు ‘సాక్షి’తో చెప్పారు. కాకపోతే విశాఖపట్నం పిచ్‌ను చూసిన తర్వాత ఎలాంటి ఆదేశాలు లేకపోరుునా భారత జట్టు సంతృప్తిగానే ఉండి ఉంటుంది. క్యూరేటర్ చెబుతున్న దాని ప్రకారం మూడో రోజు లంచ్ సెషన్ నుంచి బంతి బాగా టర్న్ కావచ్చు. రెండో రోజు సాయంత్రం సెషన్‌లోనే స్పిన్నర్లకు కొంత సహకారం లభించవచ్చు.

ఈ ఏడాది ఆరంభం నుంచీ...
వైజాగ్‌లో పిచ్ అన్ని ఫార్మాట్లలోనూ స్పిన్నర్లకు స్వర్గధామమే. ఈ ఏడాది ఫిబ్రవరిలో భారత్, శ్రీలంకల మధ్య టి20 మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్‌లో లంక జట్టు కేవలం 82 పరుగులకే కుప్పకూలింది. అశ్విన్, రైనా కలిసి ఆరు ఓవర్లు వేసి కేవలం 14 పరుగుల వ్యవధిలో ఆరు వికెట్లు తీశారు. ఇక గత నెలలో జరిగిన వన్డేలోనూ పిచ్‌పై స్పిన్నర్లు పండగ చేసుకున్నారు. అమిత్ మిశ్రా, అక్షర్ పటేల్‌ల ధాటికి న్యూజిలాండ్ జట్టు కేవలం 79 పరుగులకే ఆలౌటరుుంది. ఇది భారత స్పిన్ త్రయానికి సంతోషం కలిగించే అంశం. అటు ఇంగ్లండ్ జట్టు కూడా పిచ్‌ను చూసిన తర్వాత దీనికి అనుగుణంగా సన్నద్ధమవుతోంది. మంగళవారం నాలుగు నెట్స్‌లో లోకల్ స్పిన్నర్ల సహాయంతో ఆ జట్టు బ్యాటింగ్ ప్రాక్టీస్ చేసింది.

పాత పిచ్... లోకల్ మ్యాచ్‌లు...ఈ టెస్టు కోసం వినియోగించబోతున్న పిచ్ పాతదే. గత ఏడాది దీనిపై మ్యాచ్‌లు జరిగారుు. ఈ ఏడాది మాత్రం ఇప్పటివరకూ దీనిపై పెద్ద మ్యాచ్‌లు జరగలేదు. కొన్ని లోకల్ మ్యాచ్‌లు మాత్రమే ఆడారు. ఈ టెస్టు కోసం అని ప్రత్యేకంగా పిచ్‌ను తయారు చేయలేదని, పిచ్‌ను లెవల్ చేశామని క్యూరేటర్ చెప్పారు. మైదానంలోని సెంటర్ వికెట్‌ను టెస్టు కోసం ఉపయోగిస్తున్నారు. ఏమైనా ఈ మ్యాచ్‌లో స్పిన్నర్లు పండగ చేసుకోవడం ఖాయమనే భావన అందరిలోనూ వచ్చింది. కాకపోతే సమాధానం తెలియని ప్రశ్న ఒకటి స్టేడియంలో వినిపించింది ‘మ్యాచ్ ఎన్ని రోజుల్లో ముగుస్తుందంటారు? మూడా? నాలు గా..?’. చూడాలి దీనికి సమాధానం ఏమిటో!

Advertisement
Advertisement