కొత్త కోచ్ కావలెను | Sakshi
Sakshi News home page

కొత్త కోచ్ కావలెను

Published Sat, Jul 12 2014 1:41 AM

wanted New coach

రియో డి జనీరో: ప్రపంచ ఫుట్‌బాల్ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన జట్టుగా పేరు తెచ్చుకున్న బ్రెజిల్ ఇప్పుడు దిక్కుతోచని పరిస్థితిలో ఉంది. జర్మనీ కొట్టిన చావు దెబ్బ నుంచి ఎలా తేరుకోవాలా? అని తెగ ఆలోచిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత కోచ్ లూయిజ్ ఫెలిప్ స్కొలారి భవితవ్యంపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. శనివారం నెదర్లాండ్స్‌తో జరిగే ప్లే ఆఫ్ మ్యాచ్ తర్వాత ఆయన స్థానంపై స్పష్టత రానుంది. 2002లో తమను చాంపియన్‌గా నిలిపిన స్కొలారిపై ఇప్పుడు బ్రెజిల్‌లో ఆ స్థాయిలో అభిమానం కనిపించడం లేదు.
 
 ఆయన స్థానంలో విదేశీ కోచ్‌ను తెస్తే ఎలా ఉంటుందని బ్రెజిల్ ఫుట్‌బాల్ సమాఖ్య (సీబీఎఫ్) ఆలోచిస్తోంది. ప్రస్తుతానికికైతే జట్టుతో స్కొలారి ఒప్పందం ముగియలేదు. మరోసారి స్వదేశీ కోచ్‌నే నియమించుకోవాలనుకుంటే కొరిన్‌థియాన్స్ క్లబ్‌కు గతంలో కోచ్‌గా పనిచేసిన టైట్ వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. అయితే విదేశీ కోచ్‌ను నియమించుకునేందుకు ఇదే సరైన సమయమని అక్కడి మీడియా వాదిస్తోంది. కానీ స్కొలారిని కొనసాగిస్తే 2018 వరకు జట్టు పటిష్టమవుతుందని మాజీ కెప్టెన్ కఫు అంటున్నాడు.
 

Advertisement
Advertisement