వాట్సన్ క్యాచ్ మిస్ | Sakshi
Sakshi News home page

వాట్సన్ క్యాచ్ మిస్

Published Fri, Mar 20 2015 2:53 PM

వాట్సన్ క్యాచ్ మిస్

అడిలైడ్: పాకిస్థాన్ మరో వికెట్ తీసే అవకాశాన్ని చేజేతులా జారవిడుచుకుంది. వాహబ్ రియాజ్ ఇన్నింగ్స్ 17వ ఓవర్ తొలి బంతిని బౌన్సర్ సంధించాడు. రియాజ్ వ్యూహం ఫలించి వాట్సన్ బంతిని గాల్లోకి లేపాడు. అయితే ఫైన్ లెగ్ వద్ద పాక్ ఫీల్డర్ రహత్ సునాయాస క్యాచ్ను జారవిడిచాడు. అప్పుడు ఆసీస్ స్కోరు 83/3. వాట్సన్ ను అవుట్ చేసినట్టయితే ఆసీస్ కష్టాల్లో పడిండేది. శుక్రవారం జరుగుతున్న ప్రపంచ కప్ క్వార్టర్స్ మ్యాచ్లో 214 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన ఆసీస్ 19 ఓవర్లలో మూడు వికెట్లకు 98 పరుగులు చేసింది. వాట్సన్, స్మిత్ క్రీజులో ఉన్నారు.
 

Advertisement
Advertisement