Sakshi News home page

ఆసీస్ గురించి టెన్షన్ అక్కర్లేదు: కోహ్లీ

Published Wed, Feb 22 2017 1:06 PM

ఆసీస్ గురించి టెన్షన్ అక్కర్లేదు: కోహ్లీ

పుణే: సొంతగడ్డపై విజయయాత్రను కొనసాగిస్తూ బంగ్లాదేశ్‌ను కూడా చిత్తు చేసిన టీమిండియా మరింత కాన్ఫిడెంట్ గా ఉంది. జట్టుగా తాము ప్రస్తుతం అత్యుత్తంగా రాణించడంపై టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ హర్షం వ్యక్తం చేశాడు. పుణేలో బుధవారం మీడియాతో కోహ్లీ మాట్లాడుతూ.. 'మా జట్టు ఏంతో పటిష్టంగా ఉంది. ప్రత్యర్థి ఆస్ట్రేలియా జట్టు గురించి మేము ఆందోళన చెందడం లేదు. జట్టుతో పాటు ఆటగాడిగానూ, కెప్టెన్ గానూ మెరుగవుతున్నాను. ఆసీస్ జట్టులో కొందరు మాత్రమే ఫామ్ లో ఉన్నారు. నాకు 22 ఏళ్లున్ననప్పుడు 35 ఏళ్ల వ్యక్తులతో పోల్చి చూశారు. క్రమక్రమంగా నేను ఆ దశకు చేరుకుంటున్నానను. క్రికెట్ ను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తాను' అని వివరించాడు.
 
రేపటి (గురువారం) నుంచి ఆస్ట్రేలియా, భారత్ జట్ల మధ్య పుణేలో తొలి టెస్టు ప్రారంభం కానుంది. టీమిండియా ఆటగాళ్లు పుణేలో ప్రాక్టీస్ సెషన్లో చెమటోడుస్తున్నారు. కెప్టెన్ కోహ్లీ సహా ప్రధాన ఆటగాళ్లు నెట్ సెషన్లకే పరిమితమయ్యారు. రవీంద్ర జడేజా, అశ్విన్ బౌలింగ్ లో బ్యాట్స్ మెన్ ప్రాక్టీస్ చేస్తున్నారు.  రెండు టెస్టులకు గానూ ఎలాంటి మార్పు లేకుండా చీఫ్‌ సెలక్టర్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌ నేతృత్వంలోని కమిటీ భారత జట్టును ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఈ నెల 23 నుంచి 27 వరకు పుణేలో తొలి టెస్ట్, మార్చి 4 నుంచి 8 వరకు బెంగళూరులో రెండో టెస్టు జరగనున్నాయి.  
 
మరోవైపు టీమిండియానే ఫెవరెట్ గా బరిలోకి దిగుతుంది. 2013 తరహాలోనే 4-0తో మరోసారి ఆసీస్ వైట్‌వాష్‌కు గురికాక తప్పదని హర్బజన్, మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు. 2001లో జరిగిన సిరీస్‌లో హేడెన్ , స్లేటర్, గిల్‌క్రిస్ట్, పాంటింగ్, స్టీవ్‌ వాలాంటి దిగ్గజాలుండగా.. ప్రస్తుత ఆసీస్ జట్టులో స్మిత్, వార్నర్‌ మాత్రమే ప్రధాన ఆటగాళ్లు. అశ్విన్, జడేజాలను ఇతర బ్యాట్స్ మెన్ ఎదుర్కోవడం ప్రత్యర్ధులకు అంత ఈజీ కాదని భావిస్తున్నారు. 

Advertisement
Advertisement