'ఒత్తిడిని జయించాలంటే భారత్‌తో ఆడండి' | Sakshi
Sakshi News home page

'ఒత్తిడిని జయించాలంటే భారత్‌తో ఆడండి'

Published Fri, Aug 7 2015 4:25 PM

'ఒత్తిడిని జయించాలంటే భారత్‌తో ఆడండి' - Sakshi

కరాచీ: ఒత్తిడిలో కూడా చక్కటి ప్రదర్శన చేయాలంటే భారత్‌తో వీలైనన్ని ఎక్కువ మ్యాచ్‌లు ఆడాలని పాకిస్తాన్ దిగ్గజం ఇంజమామ్ ఉల్ హక్ ఆ దేశ క్రికెటర్లకు సూచించాడు. భారత్‌తో రెగ్యులర్‌గా సిరీస్‌లు ఏర్పాటు చేయాలని పీసీబీని కోరాడు. అలాగే ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా టూర్లను కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డాడు. 'మేము ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాలో పర్యటించినప్పుడు కష్టపడ్డాం. అయితే ఒత్తిడిలో ఎలా ఆడాలో నేర్చుకున్నాం.

ప్రస్తుత క్రికెటర్లు ఒత్తిడిలో ఆడాలంటే ఉన్న చక్కటి అవకాశం రెగ్యులర్‌గా భారత్‌తో మ్యాచ్‌లు ఆడడమే' అని వ్యాఖ్యానించాడు. భారత్-పాక్ మధ్య సిరీస్ జరిగితే చూడాలని ఉందన్నాడు. భారత్‌తో ఎక్కడ ఆడామనేది కాకుండా, రెగ్యులర్‌గా ఆడితే లాభం ఉంటుందని అభిప్రాయపడ్డాడు. తమ క్రికెట్‌లో ఉన్న రాజకీయాలను తట్టుకొని కూడా యూనిస్ ఖాన్ ఆటపై దృష్టిపెడుతున్నాడని మెచ్చుకున్నాడు. పాక్ తరఫున  టెస్టుల్లో పది వేల పరుగులు పూర్తిచేసిన తొలి ఆటగాడిగా అతడు రికార్డు సృష్టించాలని ఆకాంక్షించాడు.

Advertisement
Advertisement