'విరాట్ గ్యాంగ్ పై ఒత్తిడి తీసుకొస్తాం' | Sakshi
Sakshi News home page

'విరాట్ గ్యాంగ్ పై ఒత్తిడి తీసుకొస్తాం'

Published Sun, Jul 31 2016 4:12 PM

'విరాట్ గ్యాంగ్ పై ఒత్తిడి తీసుకొస్తాం'

కింగ్స్టన్:టీమిండియాతో నాలుగు టెస్టుల సిరీస్లో భాగంగా రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో రెండొంద పరుగుల లోపే చాపచుట్టేసిన ఆతిథ్య వెస్టిండీస్ జట్టు.. ఇక ప్రత్యర్థి జట్టును ఒత్తిడిలోకి నెట్టాలని వ్యూహరచన చేస్తోంది. ఇక తమ ముందున్న లక్ష్యం విరాట్ గ్యాంగ్ ను సాధ్యమైనంత తొందరగా అవుట్ చేసి వారిపై ఒత్తిడి తీసుకురావడమేనని విండీస్ బ్యాట్స్మన్ జెర్మైన్ బ్లాక్ వుడ్ స్పష్టం చేశాడు. దీంతో తాము తిరిగి పుంజుకుంటామని ధీమా వ్యక్తం చేశాడు.

 

'ఇప్పుడు మా దృష్టి టీమిండియాను ఒత్తిడిలో నెట్టడమే. విరాట్ సేనపై పైచేయి సాధించడానికి తీవ్రంగా పోరాడతాం. సాధారణంగా సబీనా పార్క్ మైదానంలోని వికెట్ నెమ్మదిగా పేస్ కు అనుకూలిస్తుంది. మేము గాడిలో పడతాం. ఇదొక భిన్నమైన ట్రాక్. ఈ వికెట్ పై నిలదొక్కుకోవడం అంత సులభం కాదు.  మేము టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకోవడం తప్పుడు నిర్ణయం కాదు. కాకపోతే సుదీర్ఘంగా క్రీజ్లో ఉండలేకపోయాం. తదుపరి సెకండ్ ఇన్నింగ్స్లో నిలకడగా ఆడటానికి యత్నిస్తాం'అని బ్లాక్ వుడ్ తెలిపాడు.


రెండో టెస్టు మొదటి ఇన్నింగ్స్ లో వెస్టిండీస్ 196 పరుగులకే ఆలౌటైన సంగతి తెలిసిందే. ఆ తరువాత తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన టీమిండియా వికెట్ నష్టానికి 126 పరుగులు చేసింది. ఓపెనర్ శిఖర్ ధవన్(27) అవుట్ కాగా, మురళీ విజయ్ స్థానంలో జట్టులోకి వచ్చిన కేఎల్ రాహుల్(75 బ్యాటింగ్), పూజారా(18 బ్యాటింగ్) క్రీజ్లో ఉన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement