టీం ఇండియాకు ఫైనల్ చేరే అవకాశాలున్నాయి | Sakshi
Sakshi News home page

టీం ఇండియాకు ఫైనల్ చేరే అవకాశాలున్నాయి

Published Tue, Mar 4 2014 2:56 PM

We're putting in lot of efforts in asia cup , says Ambati Rayudu

మిర్పూర్: ఆసియాకప్ లో టీం ఇండియా ఫైనల్ కు చేరేందుకు అవకాశాలు పూర్తిగా మూసుకుపోలేదని మిడిల్ ఆర్డర్ ఆటగాడు అంబటి రాయుడు తెలిపాడు. వరుసు శ్రీలంక, పాకిస్తాన్ లపై ఓటమి పాలైన ఇండియా  ఫైనల్ అవకాశాలను క్లిష్టం చేసుకున్నా, ఆ ఓటమిలతో భారత్ అవకాశాలు పూర్తిగా దెబ్బతినలేదన్నాడు. ఈ రోజు జరిగే పాకిస్తాన్ -బంగ్లాదేశ్ ల మధ్య జరిగే మ్యాచ్ ను బట్టి భారత్  ఫైనల్ అవకాశాలు ఆధారపడి వుంటాయన్నాడు.

నేటి మ్యాచ్ లో పాకిస్తాన్ ఓటమి పాలైతే.. ఆఫ్ఘాన్ తో జరిగే చివరి మ్యాచ్ లో టీం ఇండియా బోనస్ పాయింట్ తో గెలిస్తే ఫైనల్ చేరే అవకాశాలుంటాయని తెలిపాడు. కాగా ఆఫ్ఘాన్ ల బౌలింగ్ విభాగం చాలా పటిష్టంగా ఉందని రాయుడు తెలిపాడు. జట్టు సహచరులు, కెప్టెన్ కోహ్లి నుంచి అనేక విషయాలు నేర్చుకుంటున్నానని స్ఫష్టం చేశాడు.

Advertisement
Advertisement