విండీస్ లక్ష్యం 192

4 May, 2015 03:32 IST|Sakshi

బ్రిడ్జిటౌన్ : ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో వెస్టిండీస్ జట్టు విజయం వైపు పయనిస్తోంది. కుక్ సేన విధించిన 192 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో విండీస్ మూడో రోజు ఆదివారం కడపటి వార్తలందేసరికి 22 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 62 పరుగులు చేసింది. క్రీజులో బ్రేవో (15), శామ్యూల్స్ (12) ఉన్నారు. అంతకుముందు ఇంగ్లండ్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 42.1 ఓవర్లలో 123 పరుగులకే కుప్పకూలింది. టేలర్, హోల్డర్, పెరుమాళ్ మూడేసి వికెట్లు తీశారు.

మరిన్ని వార్తలు