ఫొటోలోని క్రికెటర్ ఎవరో తెలుసా? | Sakshi
Sakshi News home page

ఫొటోలోని క్రికెటర్ ఎవరో తెలుసా?

Published Thu, Jul 21 2016 4:11 PM

ఫొటోలోని క్రికెటర్ ఎవరో తెలుసా?

సెయింట్ కిట్స్: ' నా ముందు ఏమున్నా ఎంచక్కా లాగించేస్తా. ఇంట్లో చేసిన వంటకాలైతే తనివి తీరా ఆస్వాదిస్తా. అందులోనూ అమ్మ చేసిన బర్గర్లు అంటే ఇంకా ఇష్టం' అంటూ ఫొటోకు పోజిచ్చిన కుర్రాడు ఎవరో తెలుసా?, ప్రస్తుతం టీమిండియా జట్టులో కీలక ఆటగాడు.  అటు క్రికెటర్గా, ఇటు టెస్టు కెప్టెన్గా క్రికెట్లో తనదైన ముద్ర వేసిన విరాట్ కోహ్లినే ఆ ఫోటోలో కనిపిస్తున్న బాలుడు.

ఆనాటి బాల్యపు జ్ఞాపకాలను నెమరవేసుకున్న కోహ్లి.. అందుకు సంబంధించి ఫోటోను అభిమానులతో పంచుకున్నాడు. ఆటలోనే కాదు.. సోషల్ మీడియా పోస్టింగ్లలో కూడా కోహ్లి ముందుంటాడు. ఇటీవల వెస్టిండీస్ దిగ్గజ ఆటగాడు వివ్ రిచర్డ్స్తో దిగిన ఫోటోను పోస్ట్ చేసిన కోహ్లి.. తాజాగా  చిన్నప్పుడు ముద్దుగా, బుద్ధిగా కూర్చొని బర్గర్లు తింటున్న ఫోటోను అభిమానులకు షేర్ చేశాడు. ఇలా బర్గర్లు తినడం వల్లే బొద్దుగా తయారయ్యానంటూ కోహ్లి సరదాగా చమత్కరించాడు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement