28 ఏళ్ల నిరీక్షణ ఫలించేనా? | Sakshi
Sakshi News home page

28 ఏళ్ల నిరీక్షణ ఫలించేనా?

Published Thu, Jul 10 2014 4:50 PM

28 ఏళ్ల నిరీక్షణ ఫలించేనా? - Sakshi

బ్రెజిల్: ప్రపంచకప్ గెలవాలన్నది ప్రతీ ఒక్క జట్టు కల. ఎన్ని అంతర్జాతీయ టైటిల్స్ గెలిచానా.. వరల్డ్ కప్ కు వచ్చే సరికి ఆ మజానే వేరుగా ఉంటుంది. అగ్రశ్రేణి జట్లును అధిగమిస్తూ ఫైనల్ రౌండ్ వరకూ నిలవడం అంటే దాని వెనుక కృషి మాత్రం చాలానే ఉంటుంది. అర్జెంటీనా.. ప్రపంచమేటి జట్లలో ఒకటి.  2014 ఫిఫా వరల్డ్ కప్ కు బరిలోకి దిగేముందు ఎన్నో విమర్శలు ఎదుర్కొన్న ఈ జట్టు ఫైనల్ కు చేరి ఔరా అనిపించింది. ఎప్పుడో 28 ఏళ్ల క్రితం టైటిల్ గెలిచిన అర్జెంటీనా తరువాత పెద్దగా ఆకట్టుకోలేదు. 1990 లో సెమీ ఫైనల్ వరకూ చేరిన అర్జెంటీనా.. అంతకుముందు 1978, 1986లో వరల్డ్ కప్ లు గెలిచి తన ప్రస్తానానికి నాంది పలికింది. ఆ తరువాత జట్టు సమిష్టగా వైఫల్యం చెంది ఆ దేశ అభిమానులకు షాక్ ఇస్తూనే ఉంది. ప్రస్తుతం అర్జెంటీనా ముందన్నది టైటిల్ గెలవాలనే లక్ష్యం మాత్రమే.

నిన్న జరిగిన సెమీఫైనల్లో 4-2 తేడాతో గత రన్ రప్ నెదర్లాండ్స్ ను పెనాల్టీ షూటౌట్ లో కంగుతినిపించిన అర్జెంటీనా ఫైనల్ కు చేరుకుని తమ ఎదురులేదని మరోసారి నిరూపించింది. అక్కడి వరకూ బాగానే ఉన్నా ఫైనల్ ఉన్నది చిన్నా చితకా టీం కాదు. పూర్తి టీం ఎఫెర్ట్ తో దూసుకుపోతున్న జర్మనీ.  ఈ విషయం మొన్న బ్రెజిల్ తో జరిగిన మ్యాచ్ ను చూస్తే అర్దమవుతుంది. ఏకంగా ఏడు గోల్స్ చేసి ప్రపంచకప్ సెమీస్ అంకంలో కొత్త భాష్యం చెప్పిన జర్మనీతో పోరంటే అర్జెంటీనాకు కత్తిమీద సామే. ఇరుజట్లు బలాబలాను పరిశీలిస్తే మాత్రం కచ్చితంగా జర్మనీనే ముందువరుసలో ఉంది. ఇప్పటికే మూడు టైటిల్స్ గెలిచిన జర్మనీ చివరిగా 1990 లో ఫిఫా ప్రపంచకప్ ను కైవసం చేసుకుంది. ఈసారి ఎలాగైనా ప్రపంచకప్ ను తమ సొంతచేసుకోవాలని భావిస్తోంది జర్మనీ. ఇందుకోసం తగిన ప్రణాళికలు సిద్ధం చేసుకుంటూ..మ్యాచ్ మ్యాచ్ కు వ్యూహాల్ని మారుస్తూ దూసుకుపోతుంది.ఇందుకు ఫ్రాన్స్ తో జరిగిన క్వార్టర్స్ ఫైనల్ పోరు, బ్రెజిల్ తో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్ లో చక్కటి ఉదాహరణలు. కాగా, అర్జెంటీనా మాత్రం స్టార్ ప్లేయర్ మెస్సీపైనే ఆధారపడుతూ వస్తోంది.వరుస విజయాలతో జైత్రయాత్రను అర్జెంటీనా బానే ఆకట్టుకుంటున్నా ఒక్క ఆటగాడిపైనే ఆశలు పెట్టుకోవడం ఎంతమాత్రం సమంజసం కాదు. అర్జెంటీనా సుదీర్ఘ కలఫలించాలంటే సమిష్టి కృషి ఎంతైనా అవసరం అనడంలో ఎటువంటి సందేహం లేదు.

Advertisement

తప్పక చదవండి

Advertisement