టీమిండియా వైదొలిగితే భారీ నష్టం

5 May, 2017 17:20 IST|Sakshi
టీమిండియా వైదొలిగితే భారీ నష్టం

బెంగళూరు: చాంపియన్స్‌ ట్రోఫి నుంచి టీమిండియా వైదొలిగితే భారీ నష్టం ఏర్పడుతుందని దక్షిణాఫ్రికా క్రికెటర్లు హషీం ఆమ్లా, డేవిడ్‌ మిల్లర్‌లు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచంలోనే భారత్‌లో అత్యధికమంది క్రికెట్‌ అభిమానులున్నారని, ఈ టోర్నీలో భారత్‌ ఆడకపోతే ఆదరణ తగ్గుందని, భారీ నష్టం తప్పదని చెప్పారు.

చాంపియన్స్‌ ట్రోఫీలో టాప్‌-8 జట్లు ఆడితేనే ఆసక్తిగా ఉంటుందని మిల్లర్, ఆమ్లా అభిప్రాయపడ్డారు. భారత్‌ రాకుంటే ఆ జట్టు స్థానంలో ఎవరు ఆడుతారన్న విషయం తనకు తెలియదని చెప్పారు. దీనివెనుక రాజకీయాల గురించి తమకు తెలియదన్నారు. చాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనే జట్లను గత నెల 25వ తేదీ లోపు ప్రకటించాల్సివుండగా.. బీసీసీఐ గడువులోపు జట్టును ఎంపిక చేయలేదు. దీంతో ఈ టోర్నీలో భారత్‌ పాల్గొనడంపై సందేహాలు వచ్చాయి. ఐసీసీ, బీసీసీఐ మధ్య విభేదాలే ఇందుకు కారణమన్న వాదనలు తెరపైకి వచ్చాయి.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు