‘ఇది మూడేళ్లకు సరిపోయే లాక్‌డౌన్‌’ | Sakshi
Sakshi News home page

‘ఇది మూడేళ్లకు సరిపోయే లాక్‌డౌన్‌’

Published Sat, Apr 11 2020 2:45 PM

Will Not Return Home Once Lockdown Is Over, Chahal - Sakshi

న్యూఢిల్లీ:  కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో విధించిన ప్రస్తుత లాక్‌డౌన్‌తో ఒక కఠిన సమయాన్ని ఎదుర్కొంటున్నానని టీమిండియా స్పిన్నర్‌ యజ్వేంద్ర చహల్‌ పేర్కొన్నాడు. ఇంతటి సుదీర్ఘమైన లాక్‌డౌన్‌ను తాను ఎప్పుడూ చూడలేదని, నిద్ర కూడా సరిగా పట్టడం లేదని అంటున్నాడు. సరైన పని లేక నిద్రకు ఉపక్రమించే క‍్రమంలో చాలా ఆలస్యంగా బెడ్‌పైకి వెళుతున్నానని చహల్‌ తెలిపాడు. ఎప్పుడైతే లాక్‌డౌన్‌ ఎత్తివేస్తారో ఇక ఇంటికి తిరిగి రానంటూ జోక్‌లు పేల్చాడు. టీవీ ప్రెజంటర్‌ జతిన్‌ సప్రూతో చహల్‌ మాట్లాడుతూ పలు విషయాల్ని పంచుకున్నాడు. ‘ లాక్‌డౌన్‌ను ఎత్తివేస్తే నేను ఇంటి నుంచి బయటపడతా. నేను ఇంటికి రానే రాను. ఇంతలా ఇంట్లో ఉండటమంటే నేను భరించలేకపోతున్నా. మూడేళ్లకు సరిపడా లాక్‌డౌన్‌ను చూశా.( మాకు ఒకరంటే ఒకరికి ఇష్టం ఉండేది కాదు..!)

నేను  దగ్గర్లో  ఉన్న హోటల్లో అయినా ఉంటాను కానీ ఇంటికి రానే రాను. నాకు ఇంటి కంటే హోటలే సెట్‌ అవుతాది. ఈ రోజుల్ని మోయలేకపోతున్నా. నాకు గ్రౌండ్‌కు వెళ్లి బౌలింగ్‌ చేయాలని ఉంది. నాకు నిజంగా బౌలింగ్‌ చేయాలని కుతూహలం ఎక్కువగా ఉంది. మనకు ఇప్పుడు బోలెడంత క్రికెట్‌ ఉంది. కానీ అది యాక్షన్‌లో మాత్రం లేదు. నేను ఒక్కసారి గ్రౌండ్‌కు వెళితే అంతా సెట్‌ అవుతుంది. లాక్‌డౌన్‌ అయిపోతే కనీసం గ్రౌండ్‌కు వెళ్లి ఒక బంతైనా వేయాలి. అమ్మో ఇంతటి యాతన భరించలేకపోతున్నా’ అంటూ చహల్‌ పేర్కొన్నాడు. ‘మీరు ఎవరితో లాక్‌డౌన్‌ను ఇష్టపడతారు’ అనే ప్రశ్నకు రోహిత్‌ శర్మ, కుల్దీప్‌ యాదవ్‌లు అనే సమాధానమిచ్చాడు చహల్‌. మరి  మీ బుమ్రాతో లాక్‌డౌన్‌ ఎలా ఉంటుందనే ప్రశ్నకు బదులుగా.. అది వేస్ట్‌ మ్యాటర్‌ అంటూ చహల్‌ నవ్వులు పూయించాడు. ఏమీ మాట్లాడని బుమ్రాతో లాక్‌డౌన్‌లో ఉండలేనన్నాడు. మనం ఎక్కువగా మాట్లాడితే ఒక యార్కర్‌ను బుమ్రా మనపై వేసేస్తాడని చమత్కరించాడు. (రిలేషన్‌షిప్‌ సీక్రెట్స్‌ చెప్పిన విని రామన్‌!)

Advertisement
Advertisement