విండీస్‌ ఫాలోఆన్‌ | Sakshi
Sakshi News home page

విండీస్‌ ఫాలోఆన్‌

Published Sun, Aug 20 2017 1:20 AM

Windies' cricket team suffered in the first Test against England.

బర్మింగ్‌హామ్‌: ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో విండీస్‌ క్రికెట్‌ జట్టు కష్టాల్లో పడింది. ఓవర్‌నైట్‌ స్కోరు 44/1తో మూడో రోజు శనివారం తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన విండీస్‌ జట్టు 47 ఓవర్లలో 168 పరుగులకే కుప్పకూలింది. బ్లాక్‌వుడ్‌ (76 బంతుల్లో 79 నాటౌట్‌; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) అజేయ అర్ధసెంచరీ సాధించాడు.

ఇంగ్లండ్‌ బౌలర్లలో అండర్సన్‌ మూడు వికెట్లు పడగొట్టగా... స్టువర్ట్‌ బ్రాడ్, రొలాండ్‌ జోన్స్‌ రెండేసి వికెట్లు తీసుకున్నారు. 346 పరుగుల తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం పొందిన ఇంగ్లండ్‌ జట్టు రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించకుండా... విండీస్‌ జట్టును ఫాలోఆన్‌ ఇన్నింగ్స్‌ ఆడాలని కోరింది. ఫాలోఆన్‌ ఇన్నింగ్స్‌ మొదలుపెట్టిన విండీస్‌ కడపటి వార్తలు అందే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో 23 ఓవర్లలో 3 వికెట్లకు 64 పరుగులు చేసింది. 

Advertisement
Advertisement