మువ్వన్నెలు మురిసేలా.. | Sakshi
Sakshi News home page

మువ్వన్నెలు మురిసేలా..

Published Mon, Oct 31 2016 11:25 PM

మువ్వన్నెలు మురిసేలా..

ఆసియా చాంపియన్‌‌స ట్రోఫీ విజేతగా భారత్
ఫైనల్లో 3-2తో పాకిస్తాన్‌పై విజయం  
ఒక్కో ఆటగాడికి రూ.2 లక్షల నజరానా 


దేశం మొత్తం దీపావళి పర్వదినాన వెలిగిపోతున్న వేళ... భారత హాకీ జట్టు ఆ వెలుగును రెట్టింపు చేసింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ను చిత్తు చేసి ఆసియా చాంపియన్‌‌స ట్రోఫీ విజేతగా అవతరించింది. దేశంలో సెలబ్రిటీలంతా సైనికులకు పండగ సందేశాలను పంపుతుంటే... హాకీ జట్టు ఈ గెలుపును సైనికులకు అంకితం చేసింది. చాలా కాలం తర్వాత జాతీయ క్రీడలో ఓ గొప్ప విజయంతో మువ్వన్నెలు మురిశారుు. పండుగ రోజు దేశం యావత్తు మరింత సంబరపడింది.

కౌంటాన్ (మలేసియా): ఆసియా చాంపియన్‌‌స హాకీ టోర్నమెంట్‌లో భారత జట్టు రెండోసారి విజేతగా నిలిచింది. ఆదివారం హోరాహోరీగా జరిగిన ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ పాకిస్తాన్‌ను 3-2తో ఓడించి భారతీయుల దీపావళి ఆనందాన్ని రెట్టింపు చేసింది. అటు లీగ్ దశలో ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని చూసిన పాక్‌కు భారత ఆటగాళ్ల వీరోచిత ఆటతో మరోసారి భంగపాటు ఎదురైంది. రూపిందర్ పాల్ సింగ్ (18వ నిమిషంలో), యూసుఫ్ అఫ్ఫాన్ (23), నిఖిల్ తిమ్మయ్య (51) భారత్‌కు గోల్స్ అందించారు. పాకిస్తాన్ నుంచి ముహమ్మద్ అలీమ్ బిలాల్ (26), అలీ షాన్ (38) గోల్స్ చేశారు. 2011లో జరిగిన ప్రారంభ టోర్నమెంట్ ఫైనల్లోనూ భారత జట్టు పాకిస్తాన్‌నే ఓడించి తొలి చాంపియన్‌గా నిలిచింది.

ఆరంభం నుంచే దూకుడు
భారత్, పాక్ జట్టు ఈ టోర్నీ తుది సమరంలోనూ నువ్వా..నేనా అనే తరహాలో ఆడారుు. కెప్టెన్, గోల్‌కీపర్ శ్రీజేష్ గాయం కారణంగా ఫైనల్‌కు దూరం కాగా అతడి స్థానంలో ఆకాష్ చిక్టే బరిలోకి దిగాడు. ఇరు జట్లు కూడా విపరీతమైన ఒత్తిడితో బరిలోకి దిగినా భారత్‌కు ఏడో నిమిషంలోనే తొలి పెనాల్టీ కార్నర్ చిక్కింది. అరుుతే దీన్ని సద్వినియోగం చేసుకోలేకపోరుుంది. జస్జిత్ సింగ్ కులార్ సంధించిన ఈ షాట్ ఎడమ వైపు నుంచి వైడ్‌గా వెళ్లడంతో ఫలితం దక్కలేదు. అటువైపు 12వ నిమిషంలో పాకిస్తాన్ తరఫున ముహమ్మద్ రిజ్వాన్ జూనియర్ నుంచి వచ్చిన షాట్‌ను చాలా దగ్గరి నుంచి కీపర్ ఆకాష్ అద్భుత రీతిలో అడ్డుకున్నాడు. ఈ ప్రయత్నాలతో భారత్ 18వ నిమిషంలో లబ్ధి పొందింది. తమకు దక్కిన రెండో పెనాల్టీ కార్నర్‌ను రూపిందర్ పాల్ సింగ్ మెరుపు వేగంతో ఎడమవైపుకు ఫ్లిక్ చేసి జట్టుకు తొలి గోల్ అందించాడు. టోర్నీలో తనకిది 11వ పెనాల్టీ కార్నర్ గోల్ కావడం విశేషం. మరో మూడు నిమిషాల్లోనే రమణ్‌దీప్ అందించిన క్రాస్‌ను యూసుఫ్ ఎలాంటి పొరపాటుకు తావీయకుండా గోల్ చేసి ఆధిక్యాన్ని 2-0కి పెంచాడు. దీంతో తీవ్ర ఒత్తిడికి గురైన పాక్ తమ ఎదురుదాడులను ముమ్మరం చేసింది. 26వ నిమిషంలో పాక్ తొలి పీసీని అలీమ్ బిలాల్ గోల్‌గా మలిచి భారత్ ఆధిక్యాన్ని తగ్గించాడు. అంతేకాకుండా 38వ నిమిషంలో భారత డిఫెన్‌‌స మధ్య గ్యాప్‌ను సొమ్ము చేసుకుంటూ అలీ షాన్ మరో గోల్ చేయడంతో స్కోరు 2-2తో సమమైంది. దీంతో మ్యాచ్‌లో ఉత్కంఠ తారాస్థారుుకి చేరింది. 40వ నిమిషంలో భారత్ గోల్ చేసినా వీడియో రివ్యూలో అది అవుట్‌సైడ్ సర్కిల్ షాట్‌గా తేలింది. అరుుతే జట్టు విజయానికి కారణమైన కీలక గోల్‌ను నిఖిల్ తిమ్మయ్య 51వ నిమిషంలో సాధించాడు. సర్దార్‌సింగ్  నుంచి వచ్చిన పాస్‌ను అందుకున్న తను చక్కటి గోల్‌తో భారత శిబిరంలో ఆనందం నింపాడు. చివర్లో గోల్ కోసం పాక్ భీకర పోరాటమే చేసినా భారత్ ఎట్టి పరిస్థితిలోనూ ఏమరపాటుకు తావీయకుండా మ్యాచ్‌ను ముగించింది.

మలేసియాకు కాంస్యం
ఆతిథ్య మలేసియా జట్టు ఆసియా చాంపియన్‌‌స హాకీలో వరుసగా నాలుగోసారి కాంస్యం దక్కిం చుకుంది. మూడో స్థానం కోసం ఆదివారం జరి గిన మ్యాచ్‌లో మలేసియా 3-1 తేడాతో పెనాల్టీ షూటవుట్‌లో కొరియాపై నెగ్గింది. అంతకుముం దు నిర్ణీత సమయంలో ఇరు జట్లు 1-1 గోల్స్‌తో సమానంగా నిలిచారుు. దీంతో ఫలితం తేల్చేం దుకు పెనాల్టీ షూటవుట్ అనివార్యమైంది.

ఆటగాళ్లకు నజరానా
పాకిస్తాన్‌పై అద్భుత విజయం సా ధించిన భారత జట్టుకు హాకీ ఇండియా నజరానా ప్రకటించింది. జట్టులోని ఒక్కో ఆటగాడితో పాటు చీఫ్ కోచ్ రోలంట్ ఓల్ట్‌మన్‌‌సకు రూ.2 లక్షల చొప్పున అందించనుంది. సహాయక సిబ్బందికి రూ. లక్ష చొప్పున ఇవ్వనుంది. అలాగే టోర్నీలో అత్యధిక గోల్స్ చేయడంతో పాటు ఉత్తమ ఆటగాడిగా నిలిచిన రూపిందర్ పాల్‌సింగ్‌కు మరో రూ.2 లక్షలు ఇవ్వనుంది.

అభినందనల వెల్లువ
ఆసియా చాంపియన్‌‌స హాకీలో విజేతగా నిలిచిన భారత్‌పై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ప్రధానితో పాటు కేంద్ర మంత్రులు , సచిన్, సెహ్వాగ్ తదితర క్రీడా ప్రముఖులు తమ అభినందనలు తెలిపారు.

మన హాకీ జట్టును చూసి గర్విస్తున్నాను. ఆసియా చాంపియన్‌‌స ట్రోఫీ గెలిచినందుకు అభినందనలు.      - మోదీ
భారత హాకీ జట్టు ఎంతో గొప్ప విజయం సాధించింది. -   సచిన్ టెండూల్కర్
నిన్నటి కథలో నీతి: తల్లి ఆశీర్వాదం ఉంటే విజయం సులువవుతుంది. నేటి కథలో నీతి: తండ్రి స్థారుు తండ్రిదే.    - సెహ్వాగ్

కొరియాపై భారత మహిళల విజయం
సింగపూర్: మహిళల ఆసియా చాంపియన్‌‌స ట్రోఫీ హాకీలో భారత జట్టు 2-1తో కొరియాపై విజయం సాధించింది. ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ నుంచి రాణి (47వ నిమిషంలో), దీపికా ఠాకూర్ (54) గోల్స్ చేశారు. తొలి అర్ధభాగంలో అంతగా రాణించని భారత మహిళలు ద్వితీయార్ధంలో రెచ్చిపోవడంతో రెండు గోల్స్ నమోదయ్యారుు. నేడు (మంగళవారం) భారత జట్టు మలేసియాతో ఆడనుంది.

 

Advertisement

తప్పక చదవండి

Advertisement